'కిక్' సీక్వెల్ 'కిక్-2'రానుందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
రవితేజ, ఇలియానా జంటగా నటించిన సినిమా 'కిక్'. సురేంద్ర రెడ్డి దర్శకుడు. అప్పట్లో బాక్సాఫీస్‌ను కాసుల గలగల లాడించి పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. సినిమా క్లైమాక్స్ లో 'కిక్-2' రానుందని దర్శకుడు హింట్ ఇచ్చాడు. ఈ చిత్రానికి సీక్వెల్ రానుందని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ కార్య రూపం దాల్చలేదు.
అయితే తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ రూపొందనుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినపడుతుంది. ప్రస్తుతం రవితేజ బాబ్జీ సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే సురేందర్ రెడ్డి కూడా అల్లుఅర్జున్ 'రేసుగుర్రం'తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ముగిసిన తర్వాత 'కిక్-2 'కి సంబంధించిన పనులు ప్రారంభంకానున్నాయట. అంటే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రారంభం కావచ్చు. నిజమేదో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments