'కళాకారుడు' గా సిద్ధార్థ్

  • IndiaGlitz, [Monday,May 19 2014]
View Siddarth Gallery

తెలుగు ప్రేక్షకులుకు తనదైన నటనతో దగ్గరైన నటుడు సిద్ధార్డ్. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘జిగర్ తండా’ కాగా రెండవది ‘కావ్య తలైవన్’. ఈ సినిమాని తెలుగులోకి కూడా డబ్ చేస్తున్నారు.

నాటక రంగానికి చెందిన కళాకారుల జీవనశైళికి తగ్గట్టు సినిమాని రూపొందుతుంది. తెలుగులో ఈ సినిమా ‘కళాకారుడు’ అనే పేరుతో విడుదల కానుంది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్, నాజర్ , వేదిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎ.ఆర్,రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వసంత బాలన్ దర్శకుడు.