'ఇట్స్ మై లైఫ్' ప్లాటినమ్ వేడుక
- IndiaGlitz, [Sunday,April 27 2014]
ఇప్పటి ఎడ్యుకేషన్ సిస్టమ్, యువత ప్రవర్తన, ఇష్టాఇష్టాలపై యశశ్విని రీల్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా 'ఇట్స్ మైలైఫ్'. యస్.యస్.నాయుడు నిర్మాత. రామినేని నేతాజి దర్శకుడు. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా..
సంగీత దర్శకుడు ఎస్.ఆర్.శంకర్ మాట్లాడుతూ 'చండీ తర్వాత నేను సంగీతం సారథ్యం చేసిన రెండో సినిమా ఇది. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. అందరూ చూడాల్సిన సినిమా ఇది' అన్నారు.
నిర్మాత ఎస్.ఎస్.నాయుడు మాట్లాడుతూ 'విధ్య ప్రాముఖ్యతను తెలియజేప్పే సినిమా ఇది. చదువు ప్రెజర్ తో చదవకూడదు. దాని కారణంగా విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ సంఘటనలు వింటుంటే బాధగా ఉంటుంది. సందేశాత్మక సినిమా ఇది. యు సర్టిఫికేట్ వచ్చిన సినిమా. మే 1న విడుదల చేస్తున్నాం' అన్నారు.
డైరెక్టర్ రామినేని నేతాజి మాట్లాడుతూ 'ఇప్పటి ఎడ్యుకేషన్ విధానం గురించి తెలియచేప్పే సినిమా ఇది. కుటుంబమంతా కలిసి చూసే సినిమా. మే 1న విడుదల చేస్తున్నాం. సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం' అన్నారు.