ఆయన కోరిక అదే - అల్లరి నరేష్
Send us your feedback to audioarticles@vaarta.com
తన కామెడితో ప్రేక్షకులకు కితకితలు పెడుతన్న కామెడి హీరో అల్లరి నరేష్. దర్శకుడిని చేయాలని తండ్రి భావిస్తే హీరోగా మారాడు. తన కామెడి టైమింగ్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసే ఈ సీమటపాకాయ్ ఈ నెల 30న పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ పట్టినరోజు సందర్భంగా ఈ అల్లరోడుతో జరిపిని ఇంటర్వ్యూ విశేషాలు..
ఈ పుట్టినరోజు స్పెషల్...
ఈ సంవత్సరం ఇప్పటి వరకు బాగానే జరిగింది. ఈ సంవత్సరం నేను, రాజేష్ కలిసి నాన్నగారి బ్యానర్ ను మళ్టీ స్టార్ట్ చేశాం. ప్రస్తుతం బందిపోటు సినిమా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మా బ్యానర్ నుండి మూడు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అందులో ఒకటి నేను హీరోగా యాక్ట్ చేస్తే మిగతా రెండు సినిమాల్లో వేరే హీరోలు నటిస్తారు.
బందిపోటు విశేషాలు..
మంచి కాన్సెప్ట్. ఇంద్రగంటి మోహనకృష్ణ కథ చెప్పగానే బాగా నచ్చింది. అందుకే మా బ్యానర్ లో చేస్తున్నాం. ఇది రాబిన్ హుడ్ తరహా చిత్రం. తన తెలివి తేటలతో ఉన్నవాళ్లని దోచుకునే తెలివైన దొంగ. ఈ జూలై1న రాజమండ్రిలో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ షెడ్యూల్ 20వరకు రాజమండ్రిలో జరుగుతుంది.
స్కూప్స్ చేయను...
ఇప్పుడు చిన్నికృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో, అలాగే బందిపోటు సినిమాలో స్కూప్స్ ఉండవు. సుడిగాడు సినిమా టైమ్ లోనే స్కూప్స్ చేయనని అందరికి చెప్పేశాను. ఇప్పడు నా వద్దకి వస్తున్న దర్శక, నిర్మాతలకు అదే విషయాన్ని చెబుతున్నాను.
జయాపజయాలు సాదారĶ
Follow us on Google News and stay updated with the latest!
Comments