'అమ్మా నాన్న ఊరెళితే..' సెన్సార్
Send us your feedback to audioarticles@vaarta.com
View Amma Nanna Oorelithe Movie Gallery |
సుజాత ఆర్ట్స్ పతాకంపై గాజుల ఖాదర్ భాషా నిర్మాణ సారథ్యంలో అంజి శ్రీను డైరెక్షన్ లో జక్కుల నాగేశ్వరరావు నిర్మిస్తున్న సినిమా 'అమ్మా నాన్న ఊరెళితే..' ప్రముఖ నటి సోనియా ఆగర్వాల్ ఐటెం సాంగ్ తో పాటు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఎ సర్టిఫికేట్ పొందింది.
ఈ సందర్భంగా నిర్మాత జక్కుల నాగేశ్వరరావు మాట్లాడుతూ 'సెన్సార్ కారణంగానే సినిమా ఆలస్యం అయ్యింది. అందుకనే రీవైజింగ్ కమిటీకి వెళ్లడం జరిగింది. చివరకి ఎ సర్టిఫికేట్ పొందాం. త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం' అన్నారు.
సిద్ధార్థ్ వర్మ, విజయ్, మధు, తేజ, శిల్పాస్విత, మనస్విని, తనూష, సుస్మిత, శివకృష్ణ, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మున్నాకాశి, కెమెరా: ఖాదర్, నిర్మాత: జక్కుల నాగేశ్వరరావు, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: అంజి శ్రీను.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments