'అమృతం చందమామలో' సక్సెస్ మీట్

  • IndiaGlitz, [Wednesday,May 21 2014]
View Amrutham Chandamama Lo Success Meet Gallery

శ్రీనివాస్ అవసరాల, హరీష్ నటీనటులుగా జస్ట్ ఎల్లో మీడియా బ్యానర్ లో రూపొందిన సినిమా 'అమృతం చందమామలో'. ఊర్మిళ గుణ్ణం గంగరాజు నిర్మాతగా గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో భాగంగా.

చిత్ర దర్శకుడు గుణ్ణం గంగరాజు మాట్లాడుతూ ‘’నేను కొద్దిగా భయస్తుడిని అందుకనే నా బ్యానర్ కి జస్ట్ ఎల్లో అనే పేరు పెట్టాను. ఫ్యామిలీ మొత్తం చూసే మంచి సినిమాని రూపొందించాను. ప్రేక్షకులు సినిమాని ఆదరించారు. సినిమా బాగా రావడానికి ప్రతి ఒక ఆర్టిస్ట్ , టెక్నిషియన్ బాగా కష్టపడ్డారు. ముఖ్యగా రసూల్ సినిమాటోగ్రఫీ ప్లస్ అయ్యింది. సపోర్ట్ చేసిన ప్రతి ఒకరికి నా థాంక్స్’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ అవసరాల, హరీష్, రావు రమేష్, ఎల్బీ శ్రీరామ్, కృష్ణభగవాన్ శివన్నారాయణ, వాసు ఇంటూరి తదితరులు పాల్గొని సినిమా సక్సెస్ అయినందుకు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.