'అనామిక' వచ్చే ఏడాదిలోనే..

  • IndiaGlitz, [Tuesday,December 17 2013]

హిందీలో ఘనవిజయం సాధించిన 'కహానీ' చిత్రాన్ని. తెలుగు, తమిళ భాషల్లో 'అనామిక' పేరుతో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో విద్యా బాలన్ పోషించిన పాత్రని ఇక్కడ నయనతార పోషిస్తోంది. హర్షవర్థన్, వైభవ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు. హిందీ వెర్షన్ కి కొన్ని మార్పులు జోడించి ఈ రీమేక్ వెర్షన్ ని రూపొందిస్తున్నారని సమాచారం.

ఈ చిత్రాన్ని తొలుత విజయదశమి కానుకగా విడుదల చేయాలని చిత్రయూనిట్ భావించింది. ఆ దిశగానే చాలావరకు నిర్మాణాన్ని శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు కూడా. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల నిర్మాణంలో చోటుచేసుకున్న జాప్యంతో 'అనామిక' విడుదల విషయంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి.

దసరాకి వస్తుందనుకున్న సినిమా. డిసెంబర్ కి వాయిదా పడి. అది కూడా కార్యరూపం దాల్చక ఈ సినిమా వచ్చే ఏడాదిలో జనవరి నెలాఖరులో రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు సమాచారం. నయనతార కెరీర్ లో తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా 'అనామిక' రూపొందుతోంది. కాగా. ఈ వారంలోనే 'అనామిక' ప్రచార చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.