30న ఎంత అందంగా ఉన్నావె.
Tuesday, August 20, 2013 Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అపార్ట్ మెంట్ లో రెండు కాపురాల మధ్య జరిగే కథే ఎంత అందంగా ఉన్నావె. ఆ రెండు కుటుంబాలకు ఎప్పుడూ పడకపోయినా, వారి ఇళ్లలో పిల్లలు మాత్రం ప్రేమించుకుంటారు. ఇన్ని కలహాలను దాటుకుని వారు ఎలా ఒకటయ్యారనదే కథ.
ఎస్.ఐ. మహేంద్ర దర్శకత్వం వహించారు. నువ్విలా ఫేమ్ హీరో అజయ్ మంతెన ఈ సినిమాలోనూ హీరో. జియానా కథానాయిక. గంగపట్నం శ్రీధర్ నిర్మించిన సినిమా ఇది.బిజినెస్ బాగా జరిగిందని ఆయన అన్నారు. ప్రేమ అనేది ఎక్కడైనా ఒకటేనని, ఓ జంట మధ్య ఏదో కెమిస్ట్రీ వర్కవుట్ అయితేనే ప్రేమ పుడుతుందని, ఆ విషయాన్నే తమ సినిమాలో వైవిధ్యంగా చూపించామని దర్శకుడు చెప్పారు.
నువ్విలా తర్వాత చాలా ఆసక్తిగా చేసిన సినిమా ఇదేనని హీరో అన్నారు. అన్ని పనులు పూర్తయ్యాయి. సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ ను అందజేసింది. ఈ సినిమాను 30న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments