Pawan:పవన్ చెప్పింది నిజమే .. ఏపీలో 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం, లెక్కలతో సహా బయటపెట్టిన కేంద్రం

  • IndiaGlitz, [Wednesday,July 26 2023]

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన వారాహి విజయ యాత్ర సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 30 వేలకు పైగా మహిళలు అదృశ్యమయ్యారని పవన్ వ్యాఖ్యానించారు. కొందరు వాలంటీర్ల నుంచి మహిళలకు సంబంధించిన సమాచారం సంఘ విద్రోహ శక్తులకు చేరుతోందని.. ఈ క్రమంలోనే ఆడబిడ్డలు అదృశ్యమవుతున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై వాలంటర్లు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించగా.. ప్రభుత్వం సైతం ఆయనపై పరువు నష్టం దావా వేసేందుకు నిర్ణయించింది.

మహిళల అదృశ్యంపై పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన :

అయితే పవన్‌పై చర్యలకు దిగిన ప్రభుత్వం .. ఆడపిల్లల అదృశ్యానికి సంబంధించిన వివరాలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏపీలో మహిళల అదృశ్యంపై అధికారిక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా నిజంగానే 30 వేల మందికి పైగా ఆడబిడ్డలు అదృశ్యమయ్యారని పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ ప్రకటన చేసింది. 2019 నుంచి 2022 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మిస్సింగ్ కేసుల వివరాలను పార్లమెంట్‌కు కేంద్రం తెలియజేసింది. దేశం మొత్తం మీద దాదాపు మూడున్నర లక్షల మందికి పైగా చిన్నారులు, బాలికలు, మహిళలు అదృశ్యమయ్యారని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ కంటే తెలంగాణలో ఎక్కువగా మిస్సింగ్ కేసులు వున్నాయని అక్కడ 40 వేల మందికి పైగా ఆడబిడ్డలు అదృశ్యమైనట్లుగా కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 30,196 మంది మిస్సింగ్ :

జగన్ అధికారంలోకి వచ్చిన 2019లో ఏపీలో 2,186 మంది బాలికలు మిస్సవ్వగా.. 6,252 మంది మహిళలు అదృశ్యమయ్యారు. 2020లో 2,374 మంది బాలికలు.. 7057 మంది మహిళలు కనిపించకుండా పోయారు. 2021లో ఈ సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ఆ ఏడాది 3358 మంది బాలికలు, 8969 మంది మహిళలు అదృశ్యమయ్యారు. అలా 2019 నుంచి 2022 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 30,196 మంది ఆడపిల్లలు ( 7918 మంది బాలికలు, 22278 మహిళలు) ఆదృశ్యమయ్యారని.. అయితే తర్వాత కాలంలో వీరిలో కొందరి ఆచూకీ లభించిందని హోంశాఖ స్పష్టం చేసింది.

More News

Pooja Hegde:సోషల్ మీడియాలో పిచ్చి కూతలు .. అతడికి లీగల్ నోటీసులు పంపిన పూజా హెగ్డే

ఎప్పుడూ సైలెంట్‌గా, నవ్వుతూ, తన పని తాను చేసుకుపోయే హీరోయిన్ పూజా హెగ్డే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sundari:హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ప్రేమ్ కుమార్’ నుంచి ‘సుంద‌రీ’ సాంగ్ రిలీజ్‌

‘ సుంద‌రీ.. ఓ క‌న్నే.. నీ వైపే న‌న్నే

Tirumala:దంచికొడుతున్న వానలు.. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, దర్శనం ఇంత వేగంగానా..?

తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొన్నిరోజులుగా వానలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు,

Pawan Kalyan:మా వదిన నాకు ద్రోహం చేసింది .. ఆవిడ వల్లే ఇలా : పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

తాను హీరో అవ్వడానికే మా వదినే కారణమన్నారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ . సముద్రఖని దర్శకత్వంలో

Modi:మోడీ ప్రభుత్వంపై 'ఇండియా' కూటమి అవిశ్వాస తీర్మానం .. బీఆర్ఎస్, ఎంఐఎం మద్ధతు

ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జాతీయ రాజకీయాల్లో