హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న 'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' పృథ్వీ కుమార్తె .. హీరో ఎవరో తెలుసా..?
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణ నటులుగా సినీరంగ ప్రవేశం చేసి స్టార్ కమెడియన్లుగా ఎదిగినవారు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో ఉన్నారు. తెలుగులో ఉన్నంత మంది కమెడియన్లు మరే ఇండస్ట్రీలో లేరని చెప్పొచ్చు. అలాంటి వారిలో 'పృథ్వీరాజ్' ఒకరు. అదేనండి.. మన '30 ఇయర్స్ ఇండస్ట్రీ' పృథ్వీరాజ్. ఆయన కుటుంబం నుంచి మరొకరు సినీ రంగ ప్రవేశం చేయబోతున్నారు. వారు వేరేవరో కాదు.. పృథ్వీ కుమార్తె శ్రీలు.
తన కుమార్తె శ్రీలు త్వరలో సినీరంగ ప్రవేశం చేస్తున్నట్లు పృథ్వీరాజ్ స్వయంగా వెల్లడించారు. శ్రీలు హీరోయిన్‌గా తన స్నేహితుడి కుమారుడు క్రాంతి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోందని పృథ్వీ తెలిపారు. తొలుత శ్రీలు హోటల్ మేనేజ్‌మెంట్ చేసి మలేషియాలో సెటిల్ అవ్వాలనుకుందని ఆయన తెలిపారు. కానీ డాన్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి అన్ని నేర్చుకుందని పృథ్వీ చెప్పారు.
నటనపై మక్కువతో కొన్ని సీన్స్ చూసి అనుకరించేదని.. ఆమె ఇష్టాన్ని గ్రహించి శ్రీలుని ఇదివరకే ఇంట్రడ్యూస్ చేద్దామనుకున్నానని, కానీ కుదరలేదని పృథ్వీ వెల్లడించారు. చివరికి తన స్నేహితుడి కుమారుడు క్రాంతి హీరోగా ముగ్గురు పాట్నర్స్ కలిసి సినిమాను నిర్మించారని ఆయన చెప్పారు. షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని పృథ్వీ పేర్కొన్నారు. సీనియర్ రైటర్ ఘటికాచలం ఈ సినిమాకు ఎంతో సాయం చేశారని... శ్రీలు, క్రాంతి ప్రతిభ చూశాక నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా సినిమాను నిర్మించారని ఆయన ప్రశంసించారు.
సినిమాలోని పాటలన్నీ అద్భుతంగా వచ్చాయని... సంగీత్ ఆదిత్య మంచి సాంగ్స్ ఇచ్చారని పృథ్వీ కొనియాడారు. ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా పాటలను విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని పృథ్వీ పేర్కొన్నారు. శ్రీ పిఆర్ క్రియేషన్స్ ద్వారా ఈ కొత్త రంగుల ప్రపంచం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ఆయన తెలిపారు. ఈ సినిమాను తన ప్రతిభతో అద్భుతంగా తెరకెక్కిస్తున్న దర్శకుడికి పృథ్వీ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని... త్వరలోనే ఆయన పేరు, వివరాలు తెలియజేస్తామని పృథ్వీ స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments