మూడు దశాబ్దాల నట జీవితాన్ని పూర్తి చేసుకుంటున్న అక్కినేని నాగార్జున
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది సీనియర్ టాప్ హీరోలు ఒకడైన అక్కినేని నాగార్జున ఈ సంవత్సరంతో కెరీర్ మొదలై మూడు దశాబ్దాలు అంటే 30 ఏళ్లు పూర్తి కాబోతోంది మరి. నాగార్జున తొలి చిత్రం 'విక్రమ్' 1986లో మే 23న విడుదలై విజయం సాధించింది. వి.మధుసూదన రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన హీరోయిన్ గా నటించింది. తొలి చిత్రం తర్వాత తండ్రి అక్కినేని బాటలో నడుస్తూ విభిన్న పాత్రల్లో నటిస్తూ అక్కినేని అభిమానులను, తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ప్రేమకథా చిత్రాలు, మాస్ చిత్రాలు, క్లాస్ చిత్రాలతో పాటు అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తిరస చిత్రాల్లో కూడా నటించి మెప్పించాడు. రీసెంట్ గా మనం, సోగ్గాడే చిన్నినాయనాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టి నేటి యువకథానాయకులకు సవాలు విసురుతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com