శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 30 విమానాల రద్దు
Send us your feedback to audioarticles@vaarta.com
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ నగరాలకు వెళ్లాల్సిన పలు దేశీయ విమాన సర్వీసులను శుక్రవారం అర్ధరాత్రి నుంచి అధికారులు రద్దు చేశారు. హైదరాబాద్-ఢిల్లీ, హైదరాబాద్-పుణె, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సిన దాదాపు 30 విమానాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో వివిధ నగరాల్లో ప్రయాణికులపై ఆంక్షలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానాశ్రయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
అంతేకాకుండా రెండు అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణల్లో కరోనా కేసులు చాలా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ- ఆంద్రప్రదేశ్ నుండి ఇతర రాష్ట్రాలకు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు 14 రోజుల పాటు క్వారెంటన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివిధ రాష్ట్రాల్లో సైతం కరోనా తీవ్రత పెరగడంతో ముందు జాగ్రత్తగా విమానాలను రద్దు చేసినట్లు ఆధికారులు ప్రకటించారు. నైట్ కర్ఫ్యూ సందర్భంగా రాకపోకలకూ ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ప్రయాణికులు సైతం తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇది కూడా విమానాల రద్దుకు ఒక కారణంగా తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments