విడుదలకు ముందే... ‘మరక్కర్’కు 3 జాతీయ అవార్డులు..
- IndiaGlitz, [Tuesday,March 23 2021]
67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్రం 67వ జాతీయ చలన చిత్ర వివరాలను వెల్లడించింది. అయితే జాతీయ పురస్కారాల్లో మూడు విభాగాల్లో ‘మరక్కర్: లయన్ ఆఫ్ ద అరేబియన్ సి’ చిత్రం విజేతగా నిలిచింది. జాతీయ ఉత్తమ చిత్రం సహా స్పెషల్ ఎఫెక్ట్స్ (సిద్ధార్థ్ ప్రియదర్శన్), కాస్ట్యూమ్స్ (సుజిత్, సాయి)... వంటి అంశాల్లో అవార్డులను ఈ చిత్రం కైవసం చేసుకుంది. అయితే ఈ చిత్రం ఇప్పటికీ విడుదల కాకపోవడం విశేషం. వాస్తవానికి, గతేడాది మార్చి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. లాక్‌డౌన్ వల్ల కుదరలేదు. 2020 డిసెంబర్ 31లోపు సినిమా సెన్సార్ పూర్తవడంతో ఆ ఏడాది సినిమా కింద పరిగణించి అవార్డులు ఇచ్చారు.
ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘మరక్కల్’ మూవీ తెరకెక్కింది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోని పెరంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మోహన్‌లాల్, ప్రణవ్ మోహన్‌లాల్, అర్జున్, సునీల్ శెట్టి, ప్రభు, మంచు వారియర్, సుహాసిని, కీర్తి సురేషన్, కళ్యాణి ప్రియదర్శన్, ఫాజిల్, సిద్దిఖ్, నెడుముడి వేణు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా రూపొందింది. దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం పిరియాడికల్ మూవీగా తెరకెక్కినట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలు ఈ ఏడాది మే 19న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
భారతీయ తీరంలో మొట్టమొదటి నావికాదళ రక్షణ కోసం నియమించబడిన ప్రసిద్ధ నావికాదళ చీఫ్ కున్హాలి మరక్కర్ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. 16 వ శతాబ్దంలో జరిగిన ఓ యుద్ధం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం మూడు జాతీయ అవార్డులను గెలుచుకోవడంతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగి తేలింది. కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకుంది. దీనికి సంబంధించిన పిక్స్‌తో పాటు ఓ పోస్టును మోహన్‌లాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నేషనల్ అవార్డు విన్నర్స్ అందరికీ శుభాకాంక్షలు. అద్భుతమైన న్యూస్ విన్న వెంటనే చాలా ఆనందం కలిగింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా మరక్కర్ నేషనల్ అవార్డును గెలుచుకుంది. డైరెక్టర్ ప్రియదర్శన్, మరక్కర్ టీమ్‌కి శుభాకాంక్షాలు. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. దీనిని ఆశీర్వాద్ సినిమాస్‌తో కలిసి దీనిని సెలబ్రేట్ చేసుకున్నా. ఈ అవార్డును ఇండియన్ నేవికి డెడికేట్ చేస్తున్నా’’ అని మోహన్‌లాల్ ట్వీట్ చేశారు.