ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఈఎంఐ చెల్లింపు దారులకు భారీ ఊరట
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో యావత్ ప్రపంచ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరోవైపు.. భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నడుం బిగించి ముందడుగేసింది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రకటన చేసిన విషయం విదితమే. అయితే తాజాగా.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం నాడు కీలక ప్రకటన చేశారు. రెపో రేటును ముప్పావు శాతం తగ్గిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇదే సమయంలో రివర్స్ రెపో రేటును ఏకంగా 90 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని.. ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. రివర్స్ రెపోరేటు 4 శాతానికి చేరిందని.. రుణాల రేటు 4.4శాతానికి చేరిందన్నారు. ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటామని.. ప్రస్తుత పరిస్థితుల్ని ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తోందని శక్తికాంతదాస్ మీడియా ముందు వెల్లడించారు. ఆర్థిక స్థిరత్వం కోసం చర్యలు తీసుకుంటామన్నారు.
శుభవార్త ఇదీ..
కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఉండటంతో ఉద్యోగులు, రోజువారీ కూలీలు ఈఎంఐలను కట్టడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆర్బీఐ గవర్నర్ శుభవార్త చెప్పారు. ఈఎంఐలపై 3 నెలల మారిటోరియం అనగా.. మూడు నెలల పాటు కట్టనక్కర్లేదని ఆయన కీలక ప్రకటన చేశారు. కాగా.. ఈ టర్మ్లోన్ల ఈఎంఐలపై మార్చి 1 నుంచి 3 నెలల మారిటోరియం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నిజంగా ఇది సామాన్యుడికి శుభవార్తే.. మరీ ముఖ్యంగా ఈఎంఐలు కట్టేవారికి భారీ ఊరట లభించినట్లయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments