బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు 3 ముద్దుగుమ్మలు.. లక్షల్లో రెమ్యునరేషన్..

  • IndiaGlitz, [Tuesday,December 15 2020]

పెద్దగా అంచనాలేమీ లేకుండా స్టార్ట్ అయినప్పటికీ.. ఇప్పుడు మంచి రేటింగ్స్‌తో బిగ్‌బాస్ రియాలిటీ షో దూసుకుపోతోంది. పెద్దగా కంటెస్టెంట్లు ఎవరూ తెలియకపోవడంతో మొదట పెద్దగా ప్రేక్షకులు ఆసక్తి కనబరచలేదు. కానీ ఇప్పుడు బాగానే ఫాలో అవుతున్నారు. ఈ వారంతో బిగ్‌బాస్ సీజన్-4కి శుభం కార్డు పడనుంది. అయితే గ్రాండ్ ఫినాలేపై మాత్రం బాగా చర్చ జరుగుతుంది. గ్రాండ్ ఫినాలేకు రాబోయే అతిథి ఎవరు? అలరించబోయే సెలబ్రిటీలు ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది.

బిగ్‌బాస్ సీజన్-4కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. సీజన్-3కి కూడా ఆయనే హోస్ట్ అయినప్పటికీ.. సీజన్-4ను మరింత పర్ఫెక్షన్‌తో నాగ్ నడిపించారు. కాగా ఈ ఆదివారం అంటే ఈ నెల 20వ తేదీన గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. ఈ గ్రాండ్ ఫినాలేను భారీగా నిర్వహించేందుకు ‘మా’ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఫినాలేకు గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

అయితే గ్రాండ్ ఫినాలేలో సందడి చేసే సెలబ్రిటీల పేర్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వేడుకలో కొందరు హాట్ హీరోయిన్లు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో అలరించనున్నారని టాక్ నడుస్తోంది. నివేదా పేతురాజ్, మెహ్రీన్, లక్ష్మీరాయ్ గ్లామరస్ పెర్ఫార్మెన్స్‌లతో కనువిందు చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ పెర్ఫార్మెన్స్‌ల కోసం ఈ ముద్దుగుమ్మలు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని టాక్ నడుస్తోంది. మొత్తానికి గ్రాండ్ ఫినాలే కోసం మా యాజమాన్యం ఓ రేంజ్‌లో ఖర్చు చేయబోతోందని తెలుస్తోంది.

More News

‘స‌లార్’లో మ‌రో స్టార్ హీరో.. ఆడిష‌న్స్ షురూ అయ్యాయి

ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌లో విజ‌య్ క‌ర‌గందూర్ ‘సలార్’ అనే ప్యాన్ ఇండియా మూవీని నిర్మించనున్న సంగతి తెలిసిందే.

రజినీకాంత్ పార్టీ పేరు, గుర్తు ఖ‌రారు

త‌లైవా.. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ డిసెంబ‌ర్ 31న త‌న రాజ‌కీయ పార్టీ పేరుని అనౌన్స్ చేసి జ‌న‌వ‌రిలో పార్టీని ప్రారంభిస్తాన‌ని ఇప్ప‌టికే అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

రాజ‌మౌళి ఏంటి ఇలా చేశాడు.. టెన్ష‌న్‌లో మెగా ఫ్యాన్స్‌?

మెగాఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నారా! అంటే అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తుంది. ఇంత‌కీ మెగా ఫ్యాన్స్ టెన్ష‌న్‌కు కార‌ణం ఎవ‌రు?

బీజేపీలోకి తెలంగాణ మంత్రి తమ్ముడు..!?

తెలంగాణలో టీఆర్ఎస్‌కు పెద్ద షాకులే తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హారిక విజేత కావడానికి అనర్హురాలని చెప్పిన అభి..

గుడ్ మార్నింగ్.. హైదరాబాద్’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. ఈ పాట హౌస్‌మేట్స్‌లో ఫుల్ జోష్ నింపింది.