'2.0' త్రీడీ కాదు.. ఫోర్ డీ సినిమా
Send us your feedback to audioarticles@vaarta.com
రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ వచ్చిన 'రోబో' సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన చిత్రం '2.0'. లైకా ప్రొడక్షన్స్, కరణ్ జోహార్ సమర్పణలో సుభాష్ కరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటించారు.
ఎమీ జాక్సన్ హీరోయిన్. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందింది. ఈ సినిమాను నవంబర్ 29న విడుదల కానుంది. నవంబర్ 3న చెన్నైలో ట్రైలర్ విడుదలైంది. ఇందులో ప్రప్రథమంగా '2.0' ఫోర్ డీ టీజర్‌ను విడుదల చేశారు. ఎప్పుడూ స్టేడియంలలో ట్రైలర్ లాంచ్ చేసే శంకర్, ఈ 4 డీ టెక్నాలజీని అందరికీ చూపించాలనే చెన్నైలోని సత్యం థియేటర్స్ లో ట్రైలర్ వేడుకను నిర్వహించారని యూనిట్ సభ్యులు ప్రకటించారు.
సుధాంశు పాండే, ఆదిల్ హుసేన్, కళాభవన్ షాజాన్,రియాజ్ ఖాన్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, కెమెరా: నిరవ్ షా, ఎడిటింగ్: ఆంటోని, నిర్మాణం: సుభాష్ కరణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments