తొలి రోజునే 29 మిలియన్ల మంది వీక్షణ
Send us your feedback to audioarticles@vaarta.com
"బిగ్ బాస్ సీజన్ 7" ఊహించినట్టుగానే ఎన్నో సంచలనాలు సృష్టించింది. రేటింగ్స్ పరంగా, వ్యూయర్ షిప్ పరంగా ఊహించని ఎన్నో అద్భుతాలకు "బిగ్ బాస్ సీజన్ 7" వేదిక అయింది. సీజన్ సీజన్ కీ అపూర్వంగా పెరుగుతున్న ఆదరణ ఈ సీజన్ కి వచ్చేసరికి ఎన్నో రెట్లు పెరిగి కొత్త ప్రమాణాలకు తెర తీసింది.
తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ షో చూసి ఆదరించారు. ఇంచుమించు 5. 1 కోట్ల ప్రేక్షకులు మొదటి వారం "బిగ్ బాస్ షో చూశారని గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ని సుమారు 3 కోట్ల మంది ప్రేక్షకులు చూడడంతో ఈ సీజన్ బిగ్ బాస్ ఎంతగా ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తిరుగులేని ఈ ప్రేక్షక ఆదరణతో ఇప్పటికే నెంబర్ వన్ స్థానంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న స్టార్ మా... నెంబర్ 1 ఛానల్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
ఈ సీజన్ ఉల్టా పల్టా గా ఉండబోతోంది అని కింగ్ నాగార్జున ప్రోమోలో చెప్పిన నాటి నుంచి విపరీతమైన అంచనాలు పెరిగాయి. అవి ఇప్పుడు ఈ గణాంకాలుగా కనిపిస్తున్నాయి. ఇంకా రాబోయే ఎపిసోడ్స్ మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ షో కి స్టార్ మా లో మాత్రమే కాదు .. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో, యు ట్యూబ్ లో విపరీతమైన ఆదరణ వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments