తొలి రోజునే 29 మిలియన్ల మంది వీక్షణ

  • IndiaGlitz, [Friday,September 15 2023]

బిగ్ బాస్ సీజన్ 7 ఊహించినట్టుగానే ఎన్నో సంచలనాలు సృష్టించింది. రేటింగ్స్ పరంగా, వ్యూయర్ షిప్ పరంగా ఊహించని ఎన్నో అద్భుతాలకు బిగ్ బాస్ సీజన్ 7 వేదిక అయింది. సీజన్ సీజన్ కీ అపూర్వంగా పెరుగుతున్న ఆదరణ ఈ సీజన్ కి వచ్చేసరికి ఎన్నో రెట్లు పెరిగి కొత్త ప్రమాణాలకు తెర తీసింది.

తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ షో చూసి ఆదరించారు. ఇంచుమించు 5. 1 కోట్ల ప్రేక్షకులు మొదటి వారం బిగ్ బాస్ షో చూశారని గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ని సుమారు 3 కోట్ల మంది ప్రేక్షకులు చూడడంతో ఈ సీజన్ బిగ్ బాస్ ఎంతగా ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

తిరుగులేని ఈ ప్రేక్షక ఆదరణతో ఇప్పటికే నెంబర్ వన్ స్థానంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న స్టార్ మా... నెంబర్ 1 ఛానల్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

ఈ సీజన్ ఉల్టా పల్టా గా ఉండబోతోంది అని కింగ్ నాగార్జున ప్రోమోలో చెప్పిన నాటి నుంచి విపరీతమైన అంచనాలు పెరిగాయి. అవి ఇప్పుడు ఈ గణాంకాలుగా కనిపిస్తున్నాయి. ఇంకా రాబోయే ఎపిసోడ్స్ మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈ షో కి స్టార్ మా లో మాత్రమే కాదు .. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో, యు ట్యూబ్ లో విపరీతమైన ఆదరణ వుంది.

More News

Navadeep:మాదాపూర్ డ్రగ్స్ కేసు : పరారీలో నవదీప్ , సీపీ ప్రకటన .. ఎక్కడికి పారిపోలేదన్న హీరో

టాలీవుడ్ యువ హీరో నవదీప్ మరోసారి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. ఇటీవల వెలుగుచూసిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో

Tamil Producers:కోలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం : ధనుష్, విశాల్ సహా నలుగురు హీరోలపై బ్యాన్.. కారణమిదే

కోలీవుడ్ స్టార్ హీరోలు ధనుష్, విశాల్, అథర్వ, శింబులకు తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ షాకిచ్చింది.

Pawan Kalyan:వచ్చే ఎన్నికల్లో జనసేన - టీడీపీ కలిసే వెళ్తాయి.. పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు.

Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కాం.. కల్వకుంట్ల కవితకు మరోసారి ఈడీ నోటీసులు, రేపు హాజరవ్వాలని ఆదేశం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పరిణామాలు మరోసారి వేగంగా మారుతున్నాయి.

Ram Gopal Varma:చంద్రబాబు అరెస్ట్‌పై జూ.ఎన్టీఆర్ మౌనం.. టీడీపీకి ఇక దబిడి దిబిడే, ఆర్జీవీ ట్వీట్ వైరల్

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో దేశం ఉలిక్కిపడింది.