మహారాష్ట్రను కాటేస్తున్న కరోనా.. ఒక్కరోజే 283 కేసులు
- IndiaGlitz, [Monday,April 20 2020]
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎప్పుడు ఎవరికి కరోనా సోకుతుందో..? ఎటు నుంచి ఎవరికి సోకుతుందో..? అని ప్రజలు హడలెత్తిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఇండియాలో నమోదైన కేసుల సంఖ్య మొత్తం 17,265 అయితే.. ఇందులో 4,483 కేసులు మహారాష్ట్రలోనే నమోదవ్వడం గమనార్హం. ఇందులో 2,724 కేసులు ఒక్క ముంబైలోనే నమోదు కావడంతో అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇవాళ ఒక్కరోజే 283 కొత్త కేసులు నమోదవ్వడంతో ఆ రాష్ట్ర ప్రజలు హడలిపోతున్నారు. ఈ మొత్తం కేసుల్లో ధారవి మురికి వాడలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఈ మురికివాడలోనే 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకూ 168 కేసులు నమోదవ్వడం.. 11 మంది మరణించడంతో అక్కడ నివాసుముంటున్న కార్మికులను కలవరపాటుకు గురిచేస్తోంది. మొత్తానికి చూస్తే కరోనా కేసుల్లోనే కాదు.. మరణాల్లోనూ మహారాష్ట్రే టాప్‌లో ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా 2,428,354 మందికి కరోనా సోకగా.. 166,130 మంది ఇప్పటి వరకూ చనిపోయారు. 636,909 మంది మాత్రమే కోలుకున్నారు. ఇండియా విషయానికొస్తే.. 17,615 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా.. 559 మృత్యువాత పడ్డారు. 2,854 మంది కోలుకున్నారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు.