27న వైజాగ్ లో 'జనసేన' భారీసభ
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'జనసేన' పార్టీ పెట్టిన అనంతరం పార్టీకి సంబంధించి ఈ నెల 27న వైజాగ్ లో భారీసభను నిర్వహించడానికి సన్నాహాలు జరగుతున్నాయి. ఈ సభలో యూత్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉండటంతో నిర్వాహకులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేర ప్రతి ఊరిలో యువత బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారట. పవన్ కల్యాణ్ ప్రత్యేకశ్రద్ధ తో కంపోజ్ చేసిన గీతాన్ని ఈ సభలో విడుదలచేయనున్నారు.
'యూత్ ఆఫ్ ది నేషన్...ఫైట్ పర్ ది నేషన్' అనే నినాదంతో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభలో ఆయన రాసిన 'ఇజమ్' పుస్తకాన్ని కూడా విడుదల చేయనున్నారు. విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సాయంత్రం 4గంటలకు భారీగా నిర్వహించనబడుతున్నఈ సభకు విచ్చేయనున్నమహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభసామాన్యజనంలో ఆసక్తిని, రాజకీయనాయకుల్లోకలకలాన్ని రేపుతుంది.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments