27న ఆటోనగర్ సూర్య
Send us your feedback to audioarticles@vaarta.com
నాగచైతన్య, సమంత కలిసి నటించిన సినిమా ఆటోనగర్ సూర్య. దేవాకట్టా దర్శకత్వం వహించారు. కె.అచ్చిరెడ్డి నిర్మాత. ఈ సినిమాను ఈ నెల 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాణానంతర పనులన్నీ పూర్తయ్యాయి. తొలికాపీ కూడా సిద్ధమైంది. వచ్చే వారంలో సినిమాను సెన్సార్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
దేవాకట్టా ఈ సినిమాను ఎంతో ప్రేమించి తెరకెక్కించారని, ఈ మధ్య విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోందని, మహాశివరాత్రికి అత్యధిక థియేటర్లలో విడుదల చేయడం ఆనందంగా ఉందని అన్నారు. తాను మొదటి నుంచీ టీమ్ వర్క్ ని నమ్ముతానని, ఈ సినిమా కూడా టీమ్ వర్క్ తో చేసిందేనని, నాగచైతన్యకు మాస్ ఇమేజ్ ను తెచ్చిపెడుతుందని దేవాకట్టా అన్నారు.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments