27న అవతారం

  • IndiaGlitz, [Tuesday,February 11 2014]

అరుంధతి సినిమా తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అవతారం. రాధికా కుమారస్వామి, రిషి, భానుప్రియ, అన్నపూర్ణ కీలక పాత్రధారులు. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. యం.యుగంధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అరుంధతి ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతోంది. ఈ సినిమా ట్రైలర్ మంగళవారం హైదరాబాద్ లో విడుదలైంది.

ఈ సినిమాను ఈ నెల 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేరళలోని పాలక్కాడులో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దుష్ట శక్తులకు, ఓ మహిళకు జరిగిన పోరాటం ప్రధానంగా రూపొందించారు. గ్రాఫిక్స్ కు ప్రధానమైన స్థానం ఉన్న సినిమా ఇది. సౌందర్య లేని లోటును రాధికా కుమారస్వామి భర్తీ చేస్తుందని కోడి రామకృష్ణ అన్నారు. తన తల్లి పేరు మీద బ్యానర్ పెట్టినట్టు నిర్మాత చెప్పారు.