నాగార్జున 'గీతాంజలి' కి 27 ఏళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
'ఏయ్.. లేచిపోదామా?' ఈ డైలాగ్ వినగానే ఠక్కున గుర్తొచ్చే సినిమా 'గీతాంజలి'. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం.. నాగార్జున - మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ఒకే ఒక చిత్రం 'గీతాంజలి'. విషాదాత్మక ప్రేమకథా చిత్రాన్ని ఎంతో పొయెటిక్ గా చెప్పిన తీరు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.
టైటిల్ రోల్‌లో కొత్త నటి గిరిజ నటన ఇప్పటికీ స్మరణీయమే. ఇక ఇళయరాజా సంగీతంలో ప్రతి పాటా ఓ ఆణిముత్యమే. 'ఓ ప్రియా ప్రియా', 'ఓ పాపా లాలీ', 'జల్లంత తుళ్లింత కావాలిలే', 'ఆమని పాడవే', 'ఓం నమహ', 'నందికొండ వాగుల్లో', 'జగడ జగడ'.. ఇలా అన్ని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. 1989కి గానూ 'ఉత్తమ చిత్రం'గా నంది పురస్కారాన్ని సొంతం చేసుకున్న 'గీతాంజలి'.. అదే సంవత్సరంలో మే 12న విడుదలైంది. అంటే.. 'గీతాంజలి' విడుదలై నేటికి 27 ఏళ్లు పూర్తవుతున్నాయన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments