నాగార్జున 'గీతాంజలి' కి 27 ఏళ్లు

  • IndiaGlitz, [Thursday,May 12 2016]

'ఏయ్.. లేచిపోదామా?' ఈ డైలాగ్ విన‌గానే ఠ‌క్కున గుర్తొచ్చే సినిమా 'గీతాంజ‌లి'. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెలుగులో ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఏకైక చిత్రం.. నాగార్జున - మ‌ణిర‌త్నం కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఒకే ఒక చిత్రం 'గీతాంజ‌లి'. విషాదాత్మ‌క ప్రేమ‌క‌థా చిత్రాన్ని ఎంతో పొయెటిక్ గా చెప్పిన తీరు ఈ సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది.

టైటిల్ రోల్‌లో కొత్త న‌టి గిరిజ న‌ట‌న ఇప్ప‌టికీ స్మ‌ర‌ణీయ‌మే. ఇక‌ ఇళ‌య‌రాజా సంగీతంలో ప్ర‌తి పాటా ఓ ఆణిముత్య‌మే. 'ఓ ప్రియా ప్రియా', 'ఓ పాపా లాలీ', 'జ‌ల్లంత తుళ్లింత కావాలిలే', 'ఆమ‌ని పాడ‌వే', 'ఓం న‌మ‌హ‌', 'నందికొండ వాగుల్లో', 'జ‌గ‌డ జ‌గ‌డ‌'.. ఇలా అన్ని పాట‌లు ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉంటాయి. 1989కి గానూ 'ఉత్త‌మ చిత్రం'గా నంది పుర‌స్కారాన్ని సొంతం చేసుకున్న 'గీతాంజ‌లి'.. అదే సంవ‌త్స‌రంలో మే 12న విడుద‌లైంది. అంటే.. 'గీతాంజ‌లి' విడుద‌లై నేటికి 27 ఏళ్లు పూర్త‌వుతున్నాయ‌న్న‌మాట‌.

More News

కంట్రోల్ చేసుకుంటున్న కాజల్

బ్రహ్మోత్సవం టీజర్లో కాజల్ కనిపించిన తీరు ఆసమ్.ఈ నెల 20న ఆ చిత్రం విడుదలకు సిద్ధమైంది.దాంతో ప్రస్తుతం కాజల్ తన హిందీ చిత్రం మీద దృష్టి పెట్టింది.

చిరు 150వ చిత్రానికి హీరోయిన్ ఖరారు

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా నయనతార అయితే బాగుంటుంది అనుకున్నారు.

'ఒక మనసు' కథ ఆ సినిమాదేనా?

మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్ గా పరిచయం కాబోతోంది నీహారిక.నాగబాబు గారాల పట్టి నీహారిక ఇప్పటికే పలు టీవీ షోలతో తెలుగు వారందరికీ సుపరిచితమే.

శ్రీదివ్యకి అప్పుడలా..ఇప్పుడిలా..

తెలుగమ్మాయి శ్రీదివ్య టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లోనే బిజీగా మారింది.

సమంత కి మళ్లీ అచ్చొచ్చేనా?

ఈ తరంలో సమంత అంత లక్కీ హీరోయిన్ మరొకరులేరనే చెప్పాలి.చేసిన సినిమాల్లో దాదాపుగా హిట్సే ఉన్నాయి తనకి.అలాంటి హిట్స్ లో ఒకటి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ'.