తెలంగాణలో ఇవాళ్టికి సేఫ్.. కొత్తగా 27 కేసులు!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో గత కొన్నిరోజులుగా చూస్తే కాస్త తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ్టికి సేఫ్ జోన్లోనే ఉన్నట్లే. మరీ ముఖ్యంగా ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలతో పొలిస్తే తెలుగు రాష్ట్రాలు చాలా సేఫ్‌గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇవాళ కొత్తగా 27 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇవాళ ఇద్దరు మరణించారు. కాగా కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 15, మరో 12 మంది వలస కార్మికులకు కరోనా సోకినట్లు బులెటిన్‌లో తెలిపింది. కాగా.. తాజా లెక్కలను బట్టి చూస్తే కేసుల సంఖ్య 1661కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1,013 మంది కోలుకోగా.. 40 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 608 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
ఈ జిల్లాలు సేఫ్..
కాగా.. హైదరాబాద్‌లో మాత్రం రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నప్పటికి మిగిలిన జిల్లాల్లో మాత్రం 14 రోజులుగా సింగిల్ కేసు కూడా నమోదు కాలేదు. కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి,నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాబ్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, అసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్ అర్బన్, జనగాం, గద్వాల, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కట్టడి ప్రాంతాల్లో కరోనా తగ్గుముఖం పడుతోందని దీన్ని బట్టి తెలుస్తోంది. మరోవైపు లాక్ డౌన్లో భాగంగా చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. దీంతో కేసులు మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఇలాంటి తరుణంలో ప్రభుత్వం పునరాలోచన చేస్తుందా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments