తెలంగాణలో కొత్తగా 2511 కేసులు..

  • IndiaGlitz, [Saturday,September 05 2020]

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నేడు రాష్ట్రంలో 2500కి పైగా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ను శనివారం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 62,132 శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 2511 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కేసుల సంఖ్య 1,38,395కి చేరుకుంది.

కాగా.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 11 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తం మృతుల సంఖ్య 877కి చేరుకుందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,915 యాక్టివ్ కేసులుండగా.. గడిచిన 24 గంటల్లో 2,579 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 1,04,603కి చేరుకుంది. ఇంకా 3,145 పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది.

రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 305 కేసులు నమోదు కాగా.. కరీంనగర్- 150, ఖమ్మం 142, మేడ్చెల్- 134, నల్గొండ- 170, రంగారెడ్డి- 184, సిద్దిపేట- 80, సూర్యాపేట- వరంగల్ అర్బన్- 97 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో 25,729 ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.63 శాతం ఉండగా.. రికవరీ రేటు 75.5 శాతంగా ఉంది.

More News

పబ్-జి ప్లేస్‌లో ఫౌ-జిని తీసుకొచ్చిన అక్షయ్..

భారత్‌లో ప్రభుత్వం కొన్ని యాప్స్‌ను నిషేధించడంతో స్వదేశీ డెవలపర్స్‌కి మంచి అవకాశం దొరికనట్టైంది.

ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది.

క్రిష్ సినిమాకు ఆధారం అదేనా..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పీరియాడిక్ మూవీ స్టార్ట్ చేసిన జాగ‌ర్ల‌మూడి క్రిష్‌కు క‌రోనా వైర‌స్ పెద్ద షాకే ఇచ్చింది. షూటింగ్ ఆపేశాడు.

'వేయి శుభములు కలుగు నీకు' సినిమా టీజర్ ను విడుదల చేసిన హీరో సునీల్

జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా  మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్ గా రామ్స్ రాథోడ్ దర్శకత్వం లో

శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్.. షాకింగ్ న్యూస్ చెప్పిన సీపీ

విశాఖ శిరోముండనం కేసులో సినీ నిర్మాత, బిగ్‌బాస్ ఫేం నూతన్‌నాయుడని పోలీసులు అరెస్ట్ చేశారు.