'సుందరకాండ'కి 25 ఏళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
రీమేక్ చిత్రాలను చేయడంలో ముందుండే తెలుగు కథానాయకుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆయన రీమేక్ చేసిన చిత్రాల్లో సింహభాగం సక్సెస్ అయ్యాయి కూడా. అలా ఘనవిజయం సాధించిన చిత్రాలలో సుందరకాండ ఒకటి. తమిళంలో సూపర్ హిట్ అయిన సుందరకాండమ్ కి రీమేక్‌కి అయిన ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించారు. మీనా, అపర్ణ హీరోయిన్లుగా నటించిన ఈ మ్యూజికల్ హిట్ కి ఎం.ఎం.కీరవాణి సంగీతమందించారు.
ఇందులోని పాటలన్నీ బ్లాక్‌బస్టరే. ముఖ్యంగా ఆకాశాన సూర్యుడుండడు అంటూ సాగే పాట రెండు వెర్షన్స్‌లో వస్తుంది. ఒక వెర్షన్‌ని బాలు పాడగా, క్లైమాక్స్‌లో వచ్చే వెర్షన్‌ని చిత్ర పాడారు. ఈ పాటకిగానూ వేటూరి ఉత్తమ గీతరచయితగా, చిత్ర ఉత్తమ గాయనిగా నంది పురస్కరాలను సొంతం చేసుకున్నారు. కె.వి.వి. సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం 1992లో అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంటే.. నేటితో ఈ చిత్రం పాతికేళ్లను పూర్తిచేసుకుంటోందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout