'సుందరకాండ'కి 25 ఏళ్లు

  • IndiaGlitz, [Monday,October 02 2017]

రీమేక్ చిత్రాల‌ను చేయ‌డంలో ముందుండే తెలుగు క‌థానాయ‌కుల్లో విక్ట‌రీ వెంక‌టేష్ ఒక‌రు. ఆయ‌న రీమేక్ చేసిన చిత్రాల్లో సింహ‌భాగం స‌క్సెస్ అయ్యాయి కూడా. అలా ఘ‌న‌విజ‌యం సాధించిన చిత్రాల‌లో సుంద‌ర‌కాండ ఒక‌టి. త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన సుంద‌ర‌కాండ‌మ్ కి రీమేక్‌కి అయిన ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించారు. మీనా, అప‌ర్ణ హీరోయిన్లుగా న‌టించిన ఈ మ్యూజిక‌ల్ హిట్ కి ఎం.ఎం.కీర‌వాణి సంగీత‌మందించారు.

ఇందులోని పాట‌ల‌న్నీ బ్లాక్‌బ‌స్ట‌రే. ముఖ్యంగా ఆకాశాన సూర్యుడుండ‌డు అంటూ సాగే పాట రెండు వెర్ష‌న్స్‌లో వ‌స్తుంది. ఒక వెర్ష‌న్‌ని బాలు పాడ‌గా, క్లైమాక్స్‌లో వ‌చ్చే వెర్ష‌న్‌ని చిత్ర పాడారు. ఈ పాటకిగానూ వేటూరి ఉత్త‌మ గీత‌ర‌చ‌యిత‌గా, చిత్ర ఉత్త‌మ గాయ‌నిగా నంది పుర‌స్క‌రాల‌ను సొంతం చేసుకున్నారు. కె.వి.వి. స‌త్య‌నారాయ‌ణ నిర్మించిన ఈ చిత్రం 1992లో అక్టోబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అంటే.. నేటితో ఈ చిత్రం పాతికేళ్ల‌ను పూర్తిచేసుకుంటోంద‌న్న‌మాట‌.

More News

ఎన్టీఆర్ హ్యాట్రిక్

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం జైలవకుశ. సెప్టెంబర్ 21న విడుదలైన ఈ చిత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఓవర్సీస్లో ఈ చిత్రం తాజాగా 1.5 మిలియన్ డాలర్లను క్రాస్ చేసింది.

విశాఖకు మహానుభావుడు చిత్ర బృందం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ అధ్వర్యంలో విశాఖ సాగర తీరంలో జరుగుతున్న దసరావళి ఉత్సవాలకు మహానుభావుడు చిత్రయూనిట్ హాజరుకానున్నారు.

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఉపాధ్యక్షుడుగా ముళ్ళపూడి మోహన్

ఇటీవల జరిగిన ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (FNCC) ఎన్నికలలో శ్రీ ముళ్ళపూడి మోహన్ గారు భారీ ఆధిక్యతతో ఉపాధ్యక్షుడు గా ఎన్నికైనారు.

సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ దర్శకత్వంలో నాగశౌర్య

పక్కింటి కుర్రాడు పాత్రల్లో నటించి మన కుటుంబంలో కుర్రాడిలా మన హ్రుదయాల్లో స్థానం సంపాయించిన నాగశౌర్య ఏ చిత్రం చేసినా కుటుంబ విలువలు వుండేలా చక్కటి ఎంటర్ టైన్మెంట్ కథలు ఎంచుకుంటారు. ప్రస్తుతం నాగశౌర్య ఐరా క్రియోషన్స్ బ్యానర్ పై కాలేజి బ్యాక్డ్రాప్ లో లవ్ ఎంటర్టైన్మెంట్ చిత్రం చేస్తున్నారు.

శర్వా కెరీర్లోనే బెస్ట్ గా 'మహానుభావుడు'

యువ కథానాయకుడు శర్వానంద్ దసరా సందర్భంగా విడుదలైన మహానుభావుడు చిత్రంతో మరో సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది వేసవిలో శర్వానంద్ నటించిన రాధ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.