'24' ట్రైలర్ రివ్యూ....
- IndiaGlitz, [Tuesday,April 12 2016]
కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో తెలుగులో గ్లోబల్ సినిమాస్, 2డి ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ విడుదల చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ '24'. సూర్య హీరోగా నిర్మాతగా మారి రూపొందించారు. సినిమా థియేట్రికల్ ట్రైలర్ విషయానికి వస్తే సినిమా టైంను బేస్ చేసుకుని రన్ అవుతుంది. అందుకు ఓ వాచ్ కారణమవుతుందనే వార్తలు మనం ఎప్పటి నుండో వింటున్నాం, డిఫరెంట్ సినిమాలను చేసే సూర్య, మనం సక్సెస్ తర్వాత విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమా, రెహమాన్ మ్యూజిక్ వెరసి అన్నీ విషయాలు ట్రైలర్ పై ఆసక్తిని రేకెత్తించాయి.
ట్రైలర్ నిడివి దాదాపు రెండు నిమిషాలు. ఈ ట్రైలర్ ఆత్రేయ తాను గతంలో పోగొట్టుకున్న దాన్ని తిరిగిపొందాలనుకునే నెగటివ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ లో సూర్య రెండు డిఫరెంట్ లుక్స్ లో కనపడ్డాడు. ఇతని సోదరుడు సైంటిస్ట్ టైం మిషన్ ను కనిపెడతాడు. ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య సంఘర్షణ ఉన్నట్టు చూపించారు. కానీ పూర్తిగా ఎలివేట్ చేయలేదు. మూడో సూర్య క్యారెక్టర్ ఇప్పటి జనరేషన్ కు చెందిన క్యారెక్టర్. వాచ్ మెకానిక్. సమంతను చూసి ప్రేమించడం, ఆమె వెంటపడే క్యారెక్టర్. శరణ్య సూర్య తల్లి పాత్రలో కనపడుతుంది.
ఇవే ఈ ట్రైలర్ లో మనం ముఖ్యంగా గమనించే విషయాలు. టెరిఫిక్ యాక్షన్ మూమెంట్స్ కనపడుతున్నాయి. అలాగే టైమ్ మిషన్ కు సంబంధించిన కొత్త లుక్ బావుంది. ఆత్రేయ క్యారెక్టర్ ఎవరినో కాల్చడం, వెంబడించడం, తనకు కావాల్సింది సాధించాలనుకోవడం ట్రైలర్ లో అవగతమవుతుంది. అజయ్ కీ రోల్ పోషించాడు. అలాగే నిత్యామీనన్ సైంటిస్ట్ సూర్య భార్య పాత్రలో నటించినట్టు తెలుస్తుంది. రెహమాన్ తన ట్యూన్స్ తోనే కాదు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు. తిరుణాకరసు తన సినిమాటోగ్రఫీతో ఫాంటసీ వరల్డ్ ను కొత్తగా చూపించాడు, ఓ రకంగా చెప్పాలంటే తిరుణాకరసు సినిమాను మరో లెవల్ లో చూపించాడనాలి. ట్రైలర్ లో మాయ లేదు..మంత్రాలే లేవు సాంగ్ ను మాత్రం చూడొచ్చు. విజువల్ గా సినిమా భారీగా కనపడుతుంది. సినిమాపై అంచనాలను పెంచేలా ఉందనడంలో సందేహం లేదు.