24 ప్రమోషన్స్ లో మనం-దీనికి కారణం..?
Wednesday, April 27, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య హీరోగా మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం 24. ఈ చిత్రంలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ నటించారు. ఈ చిత్రాన్ని సూర్య 2డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన 24 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మే 6న రిలీజ్ అవుతుంది. సూర్య నిర్మాత కావడంతో 24 గురించి చాలా కేర్ తీసుకుంటున్నాడు. అప్పుడే ప్రమోషన్ స్టార్ట్ చేసేసాడు. అయితే...మనం చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొని విక్రమ్ కుమార్ ఇప్పుడు 24 ప్రమోషన్స్ లో పాల్గొనడం.. 24 ట్రైలర్స్ లో మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ అంటూ ప్రచారం చేస్తుండడం... అలాగే 24 మూవీకి నిర్మాత అయిన హీరో నితిన్ ఆతర్వాత రెండు ఏరియాలకు మాత్రమే డిస్ట్రిబ్యూటర్ గా మారడం...ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యింది. అసలు దీనంతటికి కారణం ఏమిటి..?
డా.అక్కినేని - నాగార్జున - నాగ చైతన్య....ఈ ముగ్గురు కలిసి నటించిన చిత్రం మనం. ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసిక్ గా నిలిచింది. అయితే..ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా డైరెక్టర్ విక్రమ్ కుమార్ కనపడలేదు. విక్రమ్ కుమార్ కోసం మీడియా ప్రయత్నించినా...ఆయన అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. అలాంటిది ఇప్పుడు 24 ప్రమోషన్స్ లో విక్రమ్ కుమార్ పాల్గొంటుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
అలాగే 24 మూవీ ట్రైలర్లో మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ అంటూ ప్రచారం చేస్తున్నారు. హీరో సూర్యకి తమిళ్ లో ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది. ఈ విషయాన్ని టాలీవుడ్ కింగ్ నాగార్జున తమిళనాడులో ఊపిరి ప్రమోషన్స్ సమయంలో చెప్పడం కూడా జరిగింది. అంతే కాదండోయ్..నేను బాగా అభిమానించే హీరోల్లో సూర్య ఒకరు అంటూ సూర్య పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు నాగార్జున. తెలుగు ప్రేక్షకులే కాదు..నాగార్జున, అఖిల్...ఇలా చాలా మంది తెలుగు హీరోలు సూర్యను అభిమానిస్తుంటారు. తెలుగునాట డైరెక్టర్ విక్రమ్ కుమార్ కంటే హీరో సూర్యనే బాగా పాపులర్. అలాంటిది 24 మూవీ ట్రైలర్లో మనం డైరెక్టర్ అంటూ విక్రమ్ కుమార్ పేరు ప్రచారం చేస్తుండడం ఆశ్చర్యంతో పాటు అనుమానం కలిగిస్తుంది.
హీరో నితిన్ తో విక్రమ్ కుమార్ ఇష్క్ చిత్రాన్నితెరకెక్కించాడు. అప్పటి వరకు వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ కి ఇష్క్ మంచి విజయాన్ని అందించింది. ఆతర్వాత అక్కినేని హీరోలతో విక్రమ్ కుమార్ మనం చిత్రం చేయడానికి కారణం నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి. అది ఎలా అంటారా...విక్రమ్ కుమార్ సుధాకర్ రెడ్డికి మనం కథ చెప్పడం...ఆ కథ విని ఈ కథ అక్కినేని ఫ్యామిలీకి బాగుంటుందని చెప్పి నాగార్జునకి విక్రమ్ కుమార్ ని పరిచయం చేసారు. ఆవిధంగా అక్కినేని ఫ్యామిలీ హీరోలు నటించిన మనం తెర పైకి రావడానికి తెర వెనుక నితిన్ ఫ్యామిలీ కారణమైంది. అప్పటి నుంచి విక్రమ్ కుమార్ కి నితిన్ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఏర్పడింది. ఆ అనుబంధంతోనే విక్రమ్ కుమార్ 24 మూవీ తెలుగు రైట్స్ ని నితిన్ కి వచ్చేలా చేసారు .24 తెలుగు వెర్షెన్ కి నిర్మాత నితిన్ అనుకున్నారు. అయితే ఆతర్వాత ఏమైందో..ఏమో కానీ...24 తెలుగు వెర్షెన్ కి నిర్మాత అనుకున్ననితిన్ కేవలం రెండు ఏరియాలకు డిస్ట్రిబ్యూటర్ అయ్యారు.
ఎప్పుడూ లేనంతగా విక్రమ్ కుమార్ ప్రమోషన్స్ లో ఏక్టీవ్ గా పాల్గొంటుండడం...మనం డైరెక్టర్ అంటూ విక్రమ్ కుమార్ పేరు ప్రచారం చేస్తుండడం..ఈ మూవీకి నిర్మాత అనుకున్న నితిన్ రెండు ఏరియాలకు డిస్ట్రిబ్యూటర్ గా మారడం...ఇదంతా చూస్తుంటే 24 మూవీ పై ఏదో అనుమానం కలుగుతుంది. అయితే కొత్త తరహా సినిమాలను అందించడం కోసం హీరో సూర్య తపన చూస్తుంటే 24 ఖచ్చితంగా విజయం సాధించాలి అనిపిస్తుంది. మరి...ఇన్ని అనుమానాల మధ్య 24 మూవీ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మే 6 వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments