నిరాహార దీక్ష చేస్తున్న 24 నిర్మాత..

  • IndiaGlitz, [Saturday,May 14 2016]

సినిమా ప‌రిశ్ర‌మ‌ను ప‌ట్టుకుని పీడిస్తున్నభూతం పైర‌సీ. ఈ పైర‌సీ వ‌ల‌న నిర్మాత‌కు చాలా న‌ష్టం క‌లుగుతుంది. పైర‌సీని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్మాత‌లు కోర‌డం...ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్ప‌డం మామూలే. నిర్మాత‌లు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా..సినిమా రిలీజ్ నాడే పైర‌సీ సిడీ మార్కెట్ లోకి వ‌చ్చేస్తుంది.

ఇప్పుడు సూర్య న‌టించిన 24 మూవీకి కూడా అలాగే జ‌రిగింది. 24 మూవీ పైర‌సీ సిడీ రిలీజ్ రోజే మార్కెట్ లోకి వ‌చ్చేసింది. ఈ పైర‌సీ సిడీని ఈ నెల‌ 6న 9.45 నిమిషాల‌కు బెంగుళూరు పి.వి.ఆర్ ఓరియ‌న్ మాల్ లో రికార్డ్ చేసార‌ట‌. ఫోరెనిక్స్ వాట‌ర్ మార్కింగ్ ద్వారా గుర్తించామ‌ని 24 నిర్మాత జ్ఞాన‌వేల్ రాజా తెలియ‌చేసారు. పైర‌సీని అరిక‌ట్టేందుకు ప‌రిశ్ర‌మ ముందుకు రావాలని కోరుతూ శుక్ర‌వారం నుంచి చెన్నైలో జ్ఞాన‌వేల్ రాజా నిర‌హార దీక్ష చేస్తున్నారు. పైర‌సీ స‌మ‌స్య‌ను సినీ ప‌రిశ్ర‌మ సీరియ‌స్ గా తీసుకోవాలి. సినీ ప‌రిశ్ర‌మ స్పందించే వ‌ర‌కు దీక్ష కొన‌సాగిస్తాను అంటున్నారు జ్ఞాన‌వేల్ రాజా.

మ‌రి...ఈ దీక్ష ఎంత వ‌ర‌కు వెళుతుందో..? ప‌రిశ్ర‌మ - ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.