24 Kisses Review
అవార్డుల డైరెక్టర్‌గా కంటే కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకోవాలనుకున్నాడేమో... `మిణుగురులు`తో అవార్డులు, అప్రిషియేషన్స్ అందుకున్న అయోధ్యకుమార్ `24 కిస్సెస్`ను అనౌన్స్ చేశాడు. సరే ఏం చేద్దాం `అర్జున్ రెడ్డి`, `ఆర్.ఎక్స్ 100` చిత్రాలను ఆదరించారు కదా.. మరి ముద్దుల గొప్పతనాన్ని మరింత గొప్పగా ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ అనే ఎమోషన్‌ను నిజాయతీ చెప్పే సమాధానం ముద్దు కాబట్టి దీనిపైనే సినిమా చేస్తే సరిపోతుందనుకుని అయోధ్యకుమార్ చేసిన ప్రయత్నమిది. మరి 24 ముద్దులేంటి? అనే విషయం తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం..
కథ:
ఆనంద్(అరుణ్ అదిత్) సైక్రియాటిస్ట్ మూర్తి(రావు రమేష్) దగ్గరకు వెళ్లి తన మానసిక సమస్యను చెప్పడంతో కథ స్టార్ట్ అవుతుంది. ఆనంద్ ఓ చిల్డ్రన్ ఫిలిం మేకర్. అప్పటికే రెండు, మూడు సినిమాలు చేసుంటాడు. మరో సినిమాను తెరకెక్కించాలని అందుకోసం నిర్మాతలు అవసరం అని భావించి వారి కోసం అన్వేషిస్తుంటాడు. ఓ కాలేజ్‌లో మెంటర్‌గా జాయిన్ అవుతాడు. అక్కడే తనకి శ్రీలక్ష్మి(హెబ్బా పటేల్) పరిచయం అవుతుంది. ఆనంద్ వీధి బాలలు కోసం పడే తపన చూసి శ్రీలక్ష్మి తనతో ప్రేమలో పడుతుంది. అనుకోకుండా ఓ సందర్భంలో ఆనంద్, శ్రీలక్ష్మి తలపై ముద్దు పెడతాడు. అసలు ఆనంద్ తలపై ముద్దు ఎందుకు పెట్టాడా? అని శ్రీలక్ష్మి ఇంటర్నెట్‌లో వెతికితే ఆమెకు 24 కిస్సెస్ ప్రాధాన్యత తెలుస్తుంది. ఆనంద్, శ్రీలక్ష్మి ముద్దుల ప్రక్రియలో ఉండగా ఆనంద్‌కు తనపై ప్రేమ లేదని శ్రీలక్ష్మి తెలుసుకుని అతనికి దూరంగా ఉంటుంది. చివరకు ఇద్దరూ కలుసుకుంటారు. అయితే ఆనంద్‌కు అప్పటికే ఇద్దరు ముగ్గురితో శారీరక సంబంధాలున్నాయని తెలుసుకున్న శ్రీలక్ష్మి అతనికి దూరంగా వెళ్లిపోతుంది. అసలు అనంద్‌కు ప్రేమ, పెళ్లి అనే వాటిపై ఎందుకు నమ్మకం ఉండడు. చివరకు ఇద్దరూ ఎలా కలుసుకున్నారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
దర్శకుడు అయోధ్యకుమార్ తొలి చిత్రం మిణుగురులు కాన్సెప్ట్‌ను ఈ సినిమాలో కూడా విడిచిపట్టలేదు. హీరో వీధి బాలలు కోసం పోరాడే వ్యక్తిగా చూపించి తన తిక్క తీర్చుకున్నాడు. అలాగే మెయిన్ కాన్సెప్ట్ విషయానికి వస్తే తొలి చిత్రానికి భిన్నమైన సినిమా నేపథ్యాన్నే ఎంచుకున్నాడు. అయితే ముద్దు అనేది ఎమోషన్ నిజాయతీగా చెప్పే సమాధానం అని చెప్పిన దర్శకుడు ఆ ఎమోషన్‌ను సీన్స్‌లోనూ, ముద్దల సీన్స్‌లో చూపెట్టలేకపోయాడు. పోనీ ఇదేమైనా అడల్ట్ మూవీలా ఉందా అంటే అది కూడా లేదు. చాలా స్లోగా నత్త కంటే నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుడికి సహానానికి సినిమా పరీక్ష పెడుతుంది. సన్నివేశాలు ఆసక్తికరంగా లేవు. సంబంధం లేకుండా సీన్స్ ఉంటాయి. ఇంత కన్‌ఫ్యూజన్ చేయాల్సిన అవసరం ఏంటో దర్శకుడికైనా అర్థమైతే చాలు. నరేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక రావు రమేష్ పాత్ర చిరాకు పెట్టిస్తుంటుంది. అరుణ్ అదిత్ కు హీరోగా ఇలాంటి సినిమా చేయడం పెద్దగా ప్లస్ కాదు. దర్శకుడిపై నమ్మకంతో ముద్దు సీన్స్‌లో నటించిన హెబ్బా ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరే. జోయా బారువా సంగీతం, పిలిప్ బ్యాగ్రౌండ్ స్కోర్ బావున్నాయి. ఉదయ్ గుర్రాల సినిమాటోగ్రఫీ బావున్నా.. కథ, కథనం, ఎమోషన్స్ లేకపోవడం, సినిమా నత్త నడకలో సాగుతూ ప్రేక్షకుడికి సహానానికి పరీక్ష పెట్టడం వంటి అంశాలతో మరుగున పడ్డాయి. మొత్తంగా అయోధ్య కుమార్ వృథా కమర్షయల్ ప్రయత్నం.
బోటమ్ లైన్: అవార్డు సినిమా కాక.. అడల్ట్ సినిమాను కాక రెండిటికీ చెడ్డ రేవడిలా `24 కిస్సెస్`
Read '24 Kisses' Movie Review in English
- Read in English