24 కిస్సెస్ సెన్సార్ పూర్తి.. అక్టోబర్ 26న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
24 కిస్సెస్ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘A’ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. అక్టోబర్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఆదిత్ అరుణ్, హెబ్బాపటేల్ జంటగా నటిస్తున్న 24 కిస్సెస్ చిత్రాన్ని తొలి సినిమాతోనే ప్రశంసలు అందుకున్న దర్శకుడు అయోధ్య కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బోల్డ్ కంటెంట్ కు తోడు అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు అయోధ్యకుమార్. హెబ్బా, ఆదిత్ మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్ కానుంది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకలను ఈ చిత్రం కచ్చితంగా అలరిస్తుందని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. రావు రమేష్, నరేష్ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. జోయ్ బరువా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఫిలిప్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఉదయ్ గుర్రాల సినిమాటోగ్రఫర్ గా పనిచేసారు.
నటీనటులు: ఆదిత్ అరుణ్, హెబ్బాపటేల్, నరేష్, రావు రమేష్, అదితి మైఖెల్, శ్రీని కాపా, మధు నెక్కంటి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com