24ఫ్రేమ్స్ అకాడమీ ఉత్తమ చిత్రం 'లజ్జ'
- IndiaGlitz, [Tuesday,February 23 2016]
24ఫ్రేమ్స్ అకాడమీ సంస్థ గతం లో c.i.d విశ్వనాధ్ వంటి ప్రయోగాత్మక సీరియల్ ను నిర్మించింది . మరియు ఏంతో మంది క్రొత్త నటీనటులకు, సాంకేతిక నిపుణులకు శిక్షణ నిస్తున్నది ,ఇకపై కొన్ని మంచి చిత్రాలకు అవార్డు లు ఇవ్వనుంది . దీనిలో భాగంగా మొదటి సారిగా 1940 లో ఒక గ్రామం చిత్రం ద్వారా జాతీయ అవార్డు , నంది అవార్డు సొంతం చేసుకొని హై స్కూల్, కమలతో ప్రయాణం వంటి చిత్రాలకు దర్సకత్వం వహించి ఇటీవల విడుదలైన "లజ్జ " చిత్రాన్ని ఉత్తమ చిత్రం గా ఎంపిక చేసారు.
ఆ సంస్థ అధినేత విశ్వనాధ్ తన్నీరు ,ఈ వేడుకను ఇటీవల ప్రసాద్ లాబ్స్ లో నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ , వీ .సాగర్ ముఖ్య అథితులుగా విచ్చేసారు . వారు మమట్లడుతూ ఈ తరహా చిత్రాన్ని తీసిన దర్శకుడు నరసింహ నంది ని , సాంకేతిక నిపుణులకు , మరియు 24 ఫ్రేమ్స్ అధినేతకు అభినందనలు తెలియజేసారు. అనంతరం చిత్ర నటీనటులకు , సాంకేతిక నిపుణులకు దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ,వీ సాగర్ అవార్డు లు అందచేసారు.
అనంతరం 24ఫ్రేమ్స్ అకాడమీ అధినేత విశ్వనాధ్ తన్నీరు మాట్లాడుతూ మా సంస్థ ప్రారంభించి 5 వ సంవత్సరం లోకి ప్రవేశించింది . గతం లో శ్రీవారు , c.i.d విశ్వనాధ్ వంటి సీరియల్స్ నిర్మించాము , ఏంతో మంది క్రొత్త నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అత్యుతమ శిక్షణ నిస్తున్న మా సంస్థ ద్వారా ఇకపై కొన్ని మంచి చిత్రాలను ఎంపిక చేసి అవార్డు లు ప్రధానం చేద్దామని నిర్ణయించాము . మా సంస్థ మొదటి సా రిగా "లజ్జ" చిత్రాన్ని ఎంపిక చేయటం చాలా సంతోషం గ ఉంది . దర్శకుడు నరసింహ నంది నాకు 15 సంవత్సరాలుగా తెలుసు , ఆయన చిత్రాలు విలువలతో ఉంటాయి , నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతఙ్ఞతలు అన్నారు .