23న మహేష్ విడుదల?
Wednesday, August 14, 2013 Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
గుడ్ సినిమా గ్రూప్ తో కలిసి ఎస్ కే పిక్చర్స్ అధినేత సురేష్ కొండేటి అనువదించిన సినిమా మహేష్. ఈ సినిమా ఆడియో ఇటీవల విడుదలైంది. గోపీ సుందర్ సంగీతం వహించారు. ఈ సినిమా అన్ని పనులను పూర్తి చేసుకుంది.ఈ సినిమాను ఈ నెల 23న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
అత్తారింటికి దారేది 21న విడుదలైతే ఈ సినిమా విడుదలలో జాప్యం జరుగుతుంది.అత్తారింటికి దారేది విడుదల కాకపోతే మాత్రం ఈ సినిమా తప్పకుండా 23న వచ్చే అవకాశాలున్నాయి. మారుతి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఆడియో విడుదల వేదికపై మారుతి మార్క్ డబుల్ మీనింగ్ డైలాగులు వినిపించాయి. దానికి తోడు యువత పేపర్లు చింపి ఎగరేసే సన్నివేశాలు ఉన్నాయని ఎస్ కేఎన్ కూడా హింట్ ఇచ్చారు.తన బ్యానర్ లో వస్తున్న కమర్షియల్ సినిమా అని సురేష్ కొండేటి కూడా చెప్పారు.ఏదేమైనా సురేష్ కూడా మారుతి బాట పట్టకూడదని శ్రేయోభిలాషులు సలహాలు ఇస్తున్నారట.తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా సందీప్ కి తెలుగులో ఎలాంటి ఫలితాన్ని రుచి చూపిస్తుందో వెయిట్ చేసి చూడాలి.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments