23న 'అగ్గిరవ్వ' ఆడియో
Friday, June 6, 2014 Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
View Aggiravva Gallery |
శ్రీధన్ మీడియా బ్యానర్ పై కోమగన్ ఎ.ఎల్.రాజా దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంతో రూపొందుతోన్న చిత్రం అగ్గిరవ్వ. స్వర్గీయ శ్రీహరి బావమరిది జయరాం కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకోంటుంది. ఈ సందర్భంగా..
నిర్మాత ఎస్.భూపతి మాట్లాడతూ ఈ సినిమా ద్వారా డిస్కో శాంతి తమ్ముడు జయరాం హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో విద్యను ఎటువంటి తార్యతమ్యం లేకుండా అందిస్తే ఎటువంటి లాభాలు వస్తాయో చూపిస్తున్నాం. ఆడియో విడుల కార్యక్రమం ఈ నెల 23న చేస్తున్నాం అన్నారు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తైనాయి. జూలై నెలలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి, భానుప్రియ, సుమన్ శెట్టి, గుండు సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్ దేవా, కెమెరా: శివరాం, నిర్మాత: ఎస్.భూపతి, కథ, కథనం, దర్శకత్వం: ఎ.ఎల్.రాజా.
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments