2వ షెడ్యూల్ లో'లక్ష్మీరావే'
Send us your feedback to audioarticles@vaarta.com
గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై నాగశౌర్య, అవికాఘోర్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా 'లక్ష్మీరావే మా ఇంటికి'. ప్రస్తుతం ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుని సెకండ్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్రారంభించింది.హీరోహీరోయిన్స్ తో పాటు హీరో ఫ్రెండ్స్ వేణు తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మే 13 వరకు హైదరాబాద్ లో జరిగే ఈ షెడ్యూల్ లో టాకీ దాదాపు పూర్తవుతుందని నిర్మాత గిరిధర్ మామిడి పల్లి తెలిపారు.
రామోజీఫిల్మ్ సిటీ, సెల్ కాన్ కార్పొరేట్ ఆఫీస్, దర్గా హౌస్ లలో ఈ చిత్రానికి సంబంధించి కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. జూన్ లో కూర్గ్, జూలైలో పాండిచ్చేరిలలో చిత్రంలోని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించడంతో సినిమా పూర్తవుతుందని నిర్మాత తెలిపారు.
నాగశౌర్య, అవికా జంగటా నటిస్తున్న ఈ సినిమాలో రావురమేష్, సీనియర్ నరేష్, ప్రగతి, అనితాచౌదరి, విద్యారావు, వెన్నెలకిషోర్ తదితరులు నటిస్తున్నారు.ఈ సినిమాకి పాటలుః భాస్కరభట్ల, సంగీతం: కె.యం.రాధాకృష్ణ, కెమెరాః బాలిరెడ్డి, నిర్మాతః మామిడిపల్లి గిరిధర్, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: నంధ్యాల రవి
Follow us on Google News and stay updated with the latest!
-
Contact at support@indiaglitz.com
Comments