తెలంగాణలో కొత్తగా 2256 కేసులు...

  • IndiaGlitz, [Saturday,August 08 2020]

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 77,513కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 14 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 615 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 22,568 యాక్టివ్ కేసులున్నాయి.

ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 54,330 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 464, రంగారెడ్డి 181, వరంగల్ అర్బన్ 187, మేడ్చల్ 138, కరీంనగర్ 101, గద్వాల్‌ 95, సంగారెడ్డి 92, పెద్దపల్లి 84, కామారెడ్డి 76 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు తెలంగాణలో 5,90,306 కరోనా టెస్టులు నిర్వహించినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

క‌రోనా వైర‌స్‌కు అస‌లైన ఆయుధం ప్లాస్మా:  చిరంజీవి

‘‘ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నారు.

రెమ్యున‌రేష‌న్‌తో నిర్మాత‌కు షాకిచ్చిన న‌య‌న‌తార‌!!

కోలీవుడ్ నిర్మాత‌ల ద‌గ్గ‌ర న‌య‌న‌తార ఎంత రెమ్యున‌రేష‌న్ వ‌సూలు చేస్తుందో తెలియ‌దు కానీ..

లోయలో పడిపోయిన విమానం.. 20 మంది మృతి

కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

సింగర్ సునీత పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

ప్రముఖ సింగర్ సునీత పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

‘ఆర్ఆర్ఆర్’ నిర్మాతకు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి టాలీవుడ్‌పై పంజా విసిరింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఆ తరువాత ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం