Electoral bonds: 22,217 ఎలక్టోరల్ బాండ్స్ విక్రయాలు.. సుప్రీంకోర్టులో SBI అఫిడవిట్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎలక్టోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు దెబ్బకి ఎట్టకేలకు SBI దొగొచ్చింది. న్యాయస్థానం చెప్పిన గడువులోగా బాండ్స్ వివరాలు సమర్పించింది. ఈ మేరకు కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. 2019 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి 15వ తేదీ వరకూ మొత్తంగా 22,217 ఎలక్టోరల్ బాండ్స్ విక్రయించినట్టు తెలిపింది. వీటిలో రాజకీయ పార్టీలు దాదాపు 22,030 బాండ్స్‌ని రెడీమ్ చేసుకున్నాయని స్పష్టంచేసింది. మిగతా 187 బాండ్స్‌ని రెడీమ్ చేసి నిబంధనల ప్రకారం ఆ నిధులన్నీ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో జమ చేసినట్టు పేర్కొంది. మొత్తం వివరాలు రెండు PDF ఫైల్స్ ద్వారా పెన్ డ్రైవ్ రూపంలో ఇచ్చామని.. పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ కూడా ఉందని అఫిడవిట్‌లో వెల్లడించింది.
కాగా అంతకుముందు ఈ వివరాలు వెల్లడించేందుకు జూన్ 30వ తేదీ వరకూ గడువు ఇవ్వాలని SBI కోరింది. కానీ దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్ని రోజులు ఏం చేశారంటూ మండిపడింది. 24 గంటల్లోగా వివరాలన్నీ ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఆదేశించింది. దీంతో వివరాలను ఈసీకి సమర్పించింది. మార్చి 15వ తేదీ సాయంత్రం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో ఈ వివరాలు పొందురుస్తుంది. ఈ స్కీమ్ ప్రకారం దాతలు ఎవరైనా SBI నుంచి బాండ్స్‌ని కొనుగోలు చేసి తమకి నచ్చిన పార్టీకి విరాళం ఇచ్చేందుకు వీలుంది. 15 రోజుల్లోగా ఆ బాండ్స్‌ని రెడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రెడీమ్ చేసుకోకపోతే అవి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో జమ అవుతాయి.
ఇదిలా ఉంటే ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. నల్లధనం నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని.. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకి దారి తీస్తుందని వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది.
2018లో ఎలక్టోరల్ బాండ్లు స్కీమ్‌ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ప్రకారం ఎవరైనా ఓ రాజకీయ పార్టీకి బాండ్‌ల రూపంలో డబ్బుని విరాళంగా ఇవ్వచ్చు. ఈ పథకం అమల్లోకి వచ్చిన దగ్గరి నుంచి ఇప్పటివరకు 30 విడతల్లో దాదాపు 28వేల ఎన్నికల బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విక్రయించింది. దీంతో వీటి మొత్తం విలువ రూ.16,518 కోట్లుగా తేలింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com