ఆక్సీజన్ లీక్.. సరఫరా నిలిచిపోవడంతో 22 మంది మృతి

  • IndiaGlitz, [Wednesday,April 21 2021]

కోవిడ్-19 విజృంభణతోపాటు ప్రాణవాయువు కొరత వేధిస్తున్న సమయంలో ఆక్సిజన్ లీక్ అయింది. ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ అవడంతో రోగులకు ప్రాణవాయువు అందించడంలో అంతరాయం ఏర్పడింది. దీంతో 22 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న డాక్టర్ జకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో బుధవారం జరిగింది. ఈ ఆసుపత్రిలో దాదాపు 150 మంది రోగులు వెంటిలేటర్, ఆక్సిజన్ సరఫరాపై ఆధారపడి ఉన్నారు.బుధవారం మధ్యాహ్నం ఆక్సిజన్ ట్యాంకర్‌లో ఆక్సిజన్‌ను వేరొక ఆక్సిజన్ ట్యాంకర్ ద్వారా నింపుతున్న సమయంలో ప్రాణవాయువు బయటకు పెల్లుబికింది.

ఈ క్రమం్లోనే దాదాపు అరగంట పాటు ఆసుపత్రిలోని రోగులకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టు ఆరోగ్యమంత్రి రాజేష్ తోపే వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు. ట్యాంకర్ లీకవడంతో గ్యాస్ ఒక్కసారిగా బయటకు వచ్చి కమ్మేసింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆక్సిజన్ లీక్‌ను వెంటనే నియంత్రించారు. అయితే ఈ క్రమంలోనే ఆక్సిజన్ అవసరమైన రోగుల్లో దాదాపు 30 మందిని వేరే హాస్పిటళ్లకు తరలించారు. ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. మరోవైపు ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఈ సమయంలో ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.

ఘటనపై మహారాష్ట్ర మంత్రి డాక్టర్ రాజేంద్ర షింగనే స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని డాక్టర్ షింగనే తెలిపారు. దీనిపై సవివరమైన నివేదికను తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ దారుణానికి బాధ్యులైనవారిని వదిలిపెట్టేది లేదన్నారు. ఘటనపై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఇదొక భయానక ఘటన అని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగులను సైతం వేరే ఆసుపత్రులకు తరలించాలని పేర్కొన్నారు. ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

More News

ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రే: టీటీడీ

శ్రీరాముడికి అత్యంత ప్రియ భక్తుడైన ఆంజనేయుని జన్మ రహస్యంపై తిరుమల తిరుపతి దేవస్థానం..

దేశంలో ఈ స్థాయిలో కేసులు.. మరణాలు ఇదే తొలిసారి

కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.

ఫేస్‌బుక్ వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త..

ఫేస్‌బుక్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని ఎప్పటి నుంచో సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శుభమా అని పెళ్లి చేద్దామంటే.. మళ్లీ క‘రోనా’..

అసలే గత ఏడాదంతా కరోనాకే అంకితమై పోయింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో పర్వాలేదనుకున్నా కూడా.. మూఢాలు కొంపముంచాయి.

పవన్ 31.. పక్కాగా ఆ ప్రొడ్యూసర్‌తోనేనట..

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జోరు మాములుగా లేదు. ఓ వైపు సినిమాలతో, మరోవైపు రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.