ఘనంగా 21వ కళాసుధ అవార్డుల వేడుక

  • IndiaGlitz, [Tuesday,April 09 2019]

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఉగాది పురస్కారాల వేడుక చెన్నై లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఇందులో భాగంగా సినీ అవార్డుల కేటగిరిలో ఉత్తమ నటి గా కీర్తి సురేష్ ( మహానటి ) ఉత్తమ దర్శకుడు సుకుమార్ ( రంగస్థలం ), జ్యురి ప్రత్యేక అవార్డు రాశిఖన్నా (తొలిప్రేమ ), ఉత్తమ చిత్రం: మహానటి , ఉత్తమ నటుడు : విజయ్ దేవరకొండ ( గీత గోవిందం ), ఉత్తమ నటి : సమంత ( రంగస్థలం ), ఉత్తమ నూతన నటి : రష్మిక మందన్న ( గీత గోవిందం), ఉత్తమ నూతన నిర్మాత : సాహు గారపాటి ( కృష్ణార్జున యుద్ధం), ఉత్తమ నూతన దర్శకుడు వెంకీ అట్లూరి ( తొలిప్రేమ ), ఉత్తమ హాస్యనటి : విద్యుల్లేఖ రామన్ ( తొలిప్రేమ ), ఉత్తమ నేపధ్య గాయని : చిన్మయి శ్రీపాద ( గీత గోవిందం )లు ఈ అవార్డులు అందుకున్నారు. వీటితో పాటు బాపు బొమ్మ అవార్డును సీనియర్ నటీమణి సుహాసిని, బాపురమణ పురస్కారం సినీ ఆర్టిస్ట్ సురేష్ కడలి లకు అందజేశారు.

ఈ అవార్డులతో పాటు మహిళా రత్న పురస్కారం అవార్డును వైద్య మరియు సేవ రంగంలో మంచి పేరు సంపాదించుకున్న శ్రీమతి కపిల దళవాయి, తెలుగు పరిశోధన అధికారి ఆవుల మంజులత లకు అందచేశారు. గత 20 సంవత్సరాలుగా శ్రీ కళాసుధ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అవార్డుల వేడుకను బేతిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా శ్రీ సురేష్ చుక్కపల్లి, శ్రీమతి కరుణ గోపాల్, ప్రముఖ గాయని పి సుశీల, ఎన్ టి చౌదరి, ఎన్వీ ప్రసాద్, విజయ చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

అవార్డు అందుకున్న సందర్బంగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ . నాకు అవార్డుల వేడుకకు చాలా మంది పిలిచారు .. కానీ స్టేజి మీదకు వెళ్లాలంటే చాలా సిగ్గు. అందుకే ఏ అవార్డులకు అటెండ్ కాను, ఆర్య సినిమాకు ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నాను .. ఆ తరువాత చాల రోజులకు కళాసుధ అవార్డు ని అందుకోవడం ఆనందంగా ఉంది అన్నారు.

హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ .. చెన్నై లో తెలుగు వాళ్ళమధ్య ఈ కార్యక్రమం ఇంతబాగా జరగడం ఆనందంగా ఉంది. తొలిప్రేమ చిత్రానికి నాకు ఈ అవార్డు ఇవ్వడం మరిచిపోలేని అనుభూతి అన్నారు.

ఈ సందర్బంగా కళాసుధ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ప్రతి సంవత్సరం ఉగాది సందర్బంగా సినిమా రంగంతో పాటు ఇతర రంగాల్లో మంచి పేరు సంపాదించుకున్న వారిపైకి అవార్డులు ఇవ్వడం అనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి అలాగే మా కమిటీ సబ్యులకు ధన్యవాదాలు అన్నారు.

More News

ఈ షార్ట్ ఫిల్మ్స్ ప్రజల్లో ఎంతో చైతన్యం తీసుకొస్తాయి - US కన్సోలేట్ జనరల్‌ కేథరిన్‌ బి హడ్డా

దేశంలో జరుగుతున్న విమెన్‌ ట్రాఫిక్‌, సెక్స్‌ రాకెట్‌లకు సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి టాలీవుడ్ ఆర్ట్స్ కమ్యూనిటీ తమ వంతు బాధ్యతగా చిత్రీకరించిన యాంటీ ట్రాఫికింగ్  షార్ట్ ఫిలిమ్స్ ని  US

జ‌య‌ల‌లిత‌గా కాజోల్‌

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో పుర‌ట్చి త‌లైవి జ‌య‌ల‌లితది ప్ర‌త్యేక స్థానం. ఈ దివంగ‌త ముఖ్య‌మంత్రి జీవిత‌క‌థ‌ను సినిమా రూపంలో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

త‌మిళంలోకి క‌ల్కి కొచ్లిన్‌

బాలీవుడ్ చిత్రం 'పింక్‌' త‌మిళ రీమేక్ 'నేర్కొండ పార్వై'. హిందీలో అమితాబ్ చేసిన పాత్ర‌ను తమిళంలో అజిత్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాల‌న్ అజిత్

ఆయన వల్ల 'అన్నయ్య' ఇబ్బంది పడ్డారు.. నీ బ‌తుకెంత‌!

కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఆండ్రియా 'మ‌హ‌ల్‌'

ఆండ్రియా జెరీమియా పేరు తెలుగువారికి కొత్త‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతంలో ప‌లు పాట‌లు పాడిన ఆమె, ర్యాప్ సింగ‌ర్‌గానూ, రైట‌ర్‌గానూ సుప‌రిచితురాలే.