విడుదల సన్నాహాల్లో '21st సెంచరీ లవ్'
Send us your feedback to audioarticles@vaarta.com
బీ.ఆర్.ఎస్.ఐ పతాకంపై గోపీనాధ్ ను హీరోగా పరిచయం చేస్తూ పోల్కంపల్లి నరేందర్ నిర్మిస్తున్న సందేశాత్మక ప్రేమకథా చిత్రం "ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్". చిత్ర దర్శకుడు గోపీనాధ్ కథానాయకుడిగానూ పరిచయమవుతున్న ఈ చిత్రంలో విష్ణుప్రియ హీరోయిన్. ధర్టీ ఈయర్స్ పృధ్వీ, నల్లవేణు, సుమన్ శెట్టి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. "గుంటూరు టాకీస్" చిత్రంతో ఘన విజయం అందుకొన్న ఆర్.కె.స్టూడియోస్ ద్వారా ఈ చిత్రం అతిత్వరలో విడుదలకానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడూ మరియు కథానాయకుడు గోపీనాధ్, నిర్మాత పోల్కంపల్లి నరేందర్, సంగీత దర్శకుడు కనిష్కలతోపాటు, ఈ చిత్రాన్ని నైజాంలో పంపిణీ చేస్తున్న ప్రముఖ నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ పాల్గొన్నారు.
ప్రతి సన్నివేశంలోనూ వినోదాన్ని పండిస్తూనే కాస్తంత సందేశాన్ని కూడా జోడించిన ఆలోచనాత్మక ప్రేమకథగా తెరకెక్కించిన "ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్" లవర్స్ తోపాటు మూవీ లవర్స్ అందర్నీ కచ్చితంగా ఆకట్టుకుంటుందని, "గుంటూర్ టాకీస్"వంటి రీసెంట్ హిట్ ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ బ్యానర్ ఆర్.కె.స్టూడియోస్ ద్వారా "ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్" విడుదలవుతుండడం సంతోషంగా ఉందని నిర్మాత పోల్కంపల్లి నరేందర్ అన్నారు.
సినిమా తనకు బాగా నచ్చిందని, అందుకే నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు.
ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహించే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కనిష్క కృతజ్నతలు తెలిపారు!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com