20వ కళాసుధ అవార్డుల ప్రధానం

  • IndiaGlitz, [Wednesday,March 14 2018]

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్న ఈ సంస్థ ఈ ఉగాది సందర్భంగా కళా సుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 20వ ఉగాది పురస్కారాలను అందించనుంది.

ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో సంస్థ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 1998 నవంబర్ 21న ప్రారంభించబడి గత 20 సంవత్సరాలుగా తెలుగు సినీ కళాకారులకు అవార్డులు అందిస్తున్నాం. ఈ ఏడాది 20వ వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఉగాది రోజున చెన్నయ్‌లో పురస్కారాల్ని అందజేయనున్నాం.

ఈ సందర్భంగా ఎంపిక చేసిన 20 మంది అవార్డు గ్రహీతలకు వెండి కిరీట ధారణ చేయాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ మంత్రి ఘంటా శ్రీనివాసరావు, మండలి బుద్ధప్రసాద్, వరప్రసాద్‌రెడ్డి, ఎ.ఎమ్.రత్నం, రామ్మోహన్‌రావు లాంటి ప్రముఖులు హాజరవుతున్నారు.

ఉగాది రోజున చెన్నయ్‌లోని మ్యూజిక్ అకాడమీలో ఈ వేడుక జరగనుంది అన్నారు. ఫణిమాధవ్ మాట్లాడుతూ కళాసుధ 20వ వసంతోత్సవం సందర్భంగా అందిస్తున్న అవార్డులు ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఈ కార్యక్రమం త్రివేణి సంగమంగా జరగనుంది. సినీ అవార్డులతోపాటు మహిళారత్న పురస్కారాలు అందజేయనున్నాం.

జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్‌గారికి అందిస్తున్నాం. బాపు-రమణ అవార్డును సాయికుమార్‌కు, బాపు బొమ్మ అవార్డును సీనియర్ నటి మాధవికి అందజేయనున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నిర్మాత కిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కళాసుధ ఉగాది పురస్కార గ్రహీతలు:

ఉత్తమ చిత్రం - శతమానం భవతి

ఉత్తమ ఆధ్యాత్మిక చిత్రం - ఓం నమో వేంకటేశాయ

ఉత్తమ సామాజిక చిత్రం - నేనే రాజు నేనే మంత్రి

ఉత్తమ హీరో - రానా

ఉత్తమ దర్శకుడు - క్రిష్ (గౌతమీపుత్ర శాతకర్ణి)

ఉత్తమ నటి - కాజల్

ప్రత్యేక జ్యూరీ అవార్డు - విజయ్ దేవరకొండ

ఉత్తమ సంగీత దర్శకుడు - థమన్

ఉత్తమ కెమెరామెన్ - ఛోటాకె.నాయుడు

ఉత్తమ నూతన నటుడు - ఘంటా రవితేజ్

ఉత్తమ నూతన నటీమణులు - రితికాసింగ్, సాయిపల్లవి, షాలినీ పాండే

ఉత్తమ పాటల రచయిత - సుద్దాల అశోక్‌తేజ

ఉత్తమ నూతన దర్శకురాలు - సుధా కొంగర (గురు)

More News

న‌య‌న‌తార‌ 'క‌ర్త‌వ్యం'.. ఉగాది సంద‌ర్బంగా మార్చి 16న విడుద‌ల

ద‌క్షిణాది అన్ని భాష‌ల్లో న‌టించి స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌ ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వం లో శివ లింగ, విక్రమ్ వేధా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్ మరియు క్రేజి ప్రాజెక్ట్ ల‌తో విజ‌యాల్ని సాధిస్తున్న‌ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తం గా  ట్ĸ

'వైశాఖం' చిత్రానికి ఎక్కువ అప్రిషియేషన్‌ తో పాటు అవార్డులు రావడం చాలా హ్యాపీగా ఉంది - జయ బి

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ, వి టీమ్‌, జె వరల్డ్‌ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు.

సినిమా బాగా లేకపోతే.. టికెట్‌ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం : 'సత్య గ్యాంగ్‌' నిర్మాత

సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాపారవేత్త మహేశ్‌ ఖన్నా నిర్మిస్తున్న చిత్రం 'సత్య గ్యాంగ్‌'.

మార్చి 23న కల్యాణ్‌రామ్‌ 'ఎంఎల్‌ఎ'

టి.జి.విశ్వప్రసాద్‌ సమర్పణలో బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వంలో కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి నిర్మిస్తోన్న చిత్రం 'ఎంఎల్‌ఎ'. ఈ సినిమా మార్చి 23న విడుదలవుతోంది.

ఉగాది రోజున జె.డి.చక్ర‌వ‌ర్తి - అమ్మ రాజ‌శేఖ‌ర్ 'ఉగ్రం' ఫస్ట్ లుక్

నక్షత్ర మీడియా పతాకంపై ఖాసిం సమర్పణలో జె.డి. చక్రవర్తి హీరోగా, అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో 'నక్షత్ర' రాజశేఖర్ నిర్మించిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ చిత్రం 'ఉగ్రం'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.