కేంద్ర బడ్జెట్ 2020: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..!

  • IndiaGlitz, [Saturday,February 01 2020]

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్-2020ను ఇవాళ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వాస్తవానికి కేంద్ర బడ్జెట్‌ వల్ల సామాన్యుడికి ఏదో ఒకరుగుతుందనుకుంటే తీరా చూస్తే ఆశించినంతగా కేటాయింపులు లేవు. మరోవైపు మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై కేంద్రం వరాల వర్షం కురిపిస్తుందనకుంటే మొండిచెయ్యి చూపించింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు, ఎంపీలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయితే.. ఎప్పట్లానే బడ్జెట్ అంటే కొన్ని వస్తువులపై ధరలు పెరగడం, కొన్నింటిపై తగ్గడం సహజం. ఈ బడ్జెట్‌ ప్రభావంతో ధరలు ఏమేం పెరిగాయి.. ? వేటిపై ధరలు తగ్గాయి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

ధరలు పెరిగేవి:

కమర్షియల్ వాహనాల స్పేర్ పార్టులు
సిగరెట్లు
వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు
స్కిమ్డ్ మిల్క్
టేబుల్ వేర్
పొగాకు ఉత్పత్తులు
వైద్య పరికరాలు
సోయా ఫైబర్, సోయా ప్రొటీన్
కిచెన్ ఉపకరణాలు
రాగి, ఉక్కు, క్లే ఐరన్
ఫర్నిచర్
చెప్పులు

ధరలు తగ్గేవి:

ప్లాస్టిక్ ఆధారిత ముడిసరుకు
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్
మొబైల్ ఫోన్ల స్పేర్ పార్టులు
ఎలక్ట్రిక్ వాహనాలు
ముడి పంచదార
వ్యవసాయాధారిత, జంతు సంబంధ ఉత్పత్తులు
కొన్నిరకాల మద్యం
పలు రసాయనాలు ధరలు తగ్గనున్నాయి. మొత్తానికి చూస్తే చిన్నపాటి శుభవార్త చెప్పిన కేంద్రం.. గట్టిగానే రాష్ట్ర ప్రభుత్వాలకు, సామాన్యులకు షాకిచ్చింది అని చెప్పుకొవచ్చు.

More News

ఫిబ్రవరిలో విడుదల కానున్న ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది

బడ్జెట్ 2020 ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లోనే డిగ్రీ కోర్సులు!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌-2020 వల్ల రైతులకు, విద్యారంగాలకు మాత్రం న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. అందేకే ఈ రెండు రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

'పలాస 1978' మూవీ నుండి నక్కిలీసు గొలుసు అనే సాంగ్ ను రిలీజ్ చేసిన డైరెక్టర్ సుకుమార్

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా  ‘‘పలాస 1978’’ .

జాతీయ భద్రతకే అత్యంత ప్రాధానం

జాతీయ భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యం పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి వేధింపులు ఉండవు ఇక పన్ను చెల్లింపు దారుల చార్టర్ పన్ను ఎగవేత ఇక క్రిమినల్ నేరం కాదు..

పవన్‌-హరీశ్ కాంబోలో సినిమా : మైత్రీ మూవీస్ ప్రకటన

టాలీవుడ్ టాప్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరాభిమానులకు మైత్రీ మూవీస్ తియ్యటి శుభవార్త అందించింది.