కేంద్ర బడ్జెట్ 2020: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..!
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్-2020ను ఇవాళ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వాస్తవానికి కేంద్ర బడ్జెట్ వల్ల సామాన్యుడికి ఏదో ఒకరుగుతుందనుకుంటే తీరా చూస్తే ఆశించినంతగా కేటాయింపులు లేవు. మరోవైపు మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై కేంద్రం వరాల వర్షం కురిపిస్తుందనకుంటే మొండిచెయ్యి చూపించింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు, ఎంపీలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయితే.. ఎప్పట్లానే బడ్జెట్ అంటే కొన్ని వస్తువులపై ధరలు పెరగడం, కొన్నింటిపై తగ్గడం సహజం. ఈ బడ్జెట్ ప్రభావంతో ధరలు ఏమేం పెరిగాయి.. ? వేటిపై ధరలు తగ్గాయి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
ధరలు పెరిగేవి:
కమర్షియల్ వాహనాల స్పేర్ పార్టులు
సిగరెట్లు
వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు
స్కిమ్డ్ మిల్క్
టేబుల్ వేర్
పొగాకు ఉత్పత్తులు
వైద్య పరికరాలు
సోయా ఫైబర్, సోయా ప్రొటీన్
కిచెన్ ఉపకరణాలు
రాగి, ఉక్కు, క్లే ఐరన్
ఫర్నిచర్
చెప్పులు
ధరలు తగ్గేవి:
ప్లాస్టిక్ ఆధారిత ముడిసరుకు
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్
మొబైల్ ఫోన్ల స్పేర్ పార్టులు
ఎలక్ట్రిక్ వాహనాలు
ముడి పంచదార
వ్యవసాయాధారిత, జంతు సంబంధ ఉత్పత్తులు
కొన్నిరకాల మద్యం
పలు రసాయనాలు ధరలు తగ్గనున్నాయి. మొత్తానికి చూస్తే చిన్నపాటి శుభవార్త చెప్పిన కేంద్రం.. గట్టిగానే రాష్ట్ర ప్రభుత్వాలకు, సామాన్యులకు షాకిచ్చింది అని చెప్పుకొవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments