2019 సినిమా రౌండప్.. ప్రధాన ఘట్టాలివీ..
Send us your feedback to audioarticles@vaarta.com
2019కు గుడ్ బై చెప్పేసి మరికొన్ని గంటల్లోనే కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే అసలు 2019లో సినీ ఇండస్ట్రీలో ఏమేం జరిగాయ్..? ఈ ఏడాది నటీనటుల్లో ఎవరికి కలిసొచ్చింది..? ఎవరికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది..? అనే విషయాలతో పలు ఆసక్తికరమైన విషయాలను సూటిగా సుత్తి లేకుండా మూడు ముక్కల్లో అందిస్తోంది.. మీ మా www.indiaglitz.com. ఇక ఆలస్యమెందుకు చదివేయండి మరి.
చోటా సినిమా సూపర్బ్ అనిపించింది!
ఈ ఏడాది చిత్రంగా.. పెద్ద సినిమాలు కొన్ని చతికిలపడగా చిన్న సినిమాలు ప్రశంసలు దక్కించుకున్నాయ్
కాన్సెప్ట్ బేస్డ్గా వచ్చిన మల్లేశం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించగా.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఔరా అనిపించాడు
మిస్ మ్యాచ్, ఫలక్‌నుమాదాస్, బ్రోచేవారెవరురా, కొబ్బరిమట్ట, కౌసల్య కృష్ణమూర్తి, రాజ్‌దూత్ సినిమాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. కాసుల వర్షం కురవకపోయినా.. ప్రేక్షకుల మన్ననలు పొంది అదుర్స్ అనిపించాయ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే జాబితాలో ఉన్నాయ్.
పెద్ద సినిమాల హవా...
సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘మహర్షి’ చిత్రంతో ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించాడు.
రూ.300కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సాహో’ తెలుగు వాళ్లకు పెద్దగా నచ్చకపోయినా మిగతా భాషల్లో బాగానే ఆదరణ వచ్చింది.. కలెక్షన్ల వర్షం కురిసింది.
ఎనర్జిటిక్ హీరో రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’,
నాగచైతన్య ‘మజిలి’
నాని ‘జెర్సీ’, ‘గ్యాంగ్‌లీడర్’
వరుణ్‌తేజ్ ‘గద్దలకొండ గణేశ్’
‘ఓ బేబీ’గా సమంత సక్సెస్ అందుకుంది.
ప్రారంభంలో ఫన్.. ఎండింగ్లో ప్రస్టేషన్:
మల్టీస్టారర్ మూవీకి తిరుగులేదని 2019 ఆరంభంలోనే వెంకీ నిరూపించాడు
విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్ ‘ఎఫ్ 2’ సినిమాతో 2019 సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పగా.. వెంకీ, నాగచైతన్యల ‘వెంకీమామ’ ఈ ఏడాదికి గుడ్‌బై చెప్పాడు.
అయితే ఎఫ్2కు గట్టిగానే కలెక్షన్లు రాగా.. వెంకీ మామకు మాత్రం అంతగా రాలేదు.
బయోపిక్‌లు:
బాలీవుడ్‌తో పోలిస్తే బయోపిక్ సక్సెస్ రేటు టాలీవుడ్లో తక్కువే
బాలయ్య ప్రధాన పాత్రలో వచ్చిన ‘కథా నాయకుడు’, ‘మహా నాయకుడు’.. అట్టర్ ప్లాప్ అయ్యాయి.. ఆ తర్వాత సినిమాలు ఆశించినంతగా ఆడకపోగా.. బాలయ్యను ప్లాప్ చేశాయ్.
రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కించిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవితకథ ఆధారంగా వచ్చిన ‘యాత్ర’ అందరి నోట కీర్తించబడింది.. థియేటర్స్ బయటికి అందర్నీ కన్నీళ్లతో రప్పించింది.
స్వాతంత్ర్యోద్యమ నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డితో సక్సెస్ అయ్యాడు కానీ.. పాన్ ఇండియా చేద్దామనే కల మాత్రం నెరవేరలేదు
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవితకథ వెండితెరపై పూర్తిస్థాయిలో ఆవిష్కరించలేదన్న వాదనలు
ప్రేక్షకులు మెచ్చిన చిత్రాలు:
ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్), కల్కి, మహర్షి, మజిలీ, చిత్రలహరి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, బ్రోచేవారెవరురా, జెర్సీ, ఇస్మార్ట్ శంకర్, ఓ బేబి, రాక్షసుడు, గద్దలకొండ గణేష్, సైరా నరసింహా రెడ్డి, జార్జ్ రెడ్డి.
టాలీవుడ్ టాప్ 10 హయ్యస్ట్ గ్రాసర్స్ ఇవే..:
సాహో, సైరా నరసింహా రెడ్డి, మహర్షి, ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్), వినయ విధేయ రామ, ఇస్మార్ట్ శంకర్, మజిలీ, జెర్సీ, వెంకీ మామ, గద్దలకొండ గణేష్
కాగా.. 2019లో ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్న హీరోలు బొక్కా బోల్తా పడ్డారు. అయితే.. కొందరు హీరోయిన్లు మొదట్లో కాస్త చతికిలపడ్డా.. మధ్యలో లేచారు. మరోవైపు కొత్త కొత్త నటీనటులు టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. మరికొందరు డైరెక్టర్ నుంచి హీరోగా మారారు. ఇంకొందరు ప్రస్తుతం సినిమా షూట్లో బిజీబిజీగా ఉన్నారు. కాగా.. రాజకీయాలు పక్కనెడితే.. సినిమాల పరంగా మాత్రం చాలా మంది 2019 చేదు జ్ఞాపకాలనే మిగిల్చిందని చెప్పుకోవచ్చు. 2019 ఎవరైతే ఫలానా స్టేజ్‌కు వెళ్లాలని కల కని విఫలమయ్యారో వాళ్లందరికీ 2020 కలిసి రావాలని మనస్పూర్తిగా www.indiaglitz.com టీమ్ కోరుకుంటోంది.. ఎనీ వే ఆల్ దిబెస్ట్..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com