2019 తెలంగాణ రౌండప్.. కేసీఆర్‌కు బూస్ట్ ఇచ్చిన వైఎస్ జగన్!

2019కు గుడ్ బై చెప్పేసి మరికొన్ని గంటల్లోనే కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే అసలు 2019లో తెలంగాణ రాష్ట్రంలో ఏమేం జరిగాయ్..? తెలంగాణ కాలం ఎవరికి కలిసొచ్చింది..? ఎవరికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది..? రెండోసారి కేసీఆర్ సీఎం అయ్యాక చోటు చేసుకున్న పరిణామాలేంటి..? కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన సంస్కరణలు, వివాదాస్పద నిర్ణయాలేంటి..? అనే విషయాలతో పలు ఆసక్తికరమైన విషయాలను సూటిగా సుత్తి లేకుండా మూడు ముక్కల్లో అందిస్తోంది.. మీ మా www.indiaglitz.com. ఇక ఆలస్యమెందుకు చదివేయండి మరి.

ప్రధాన ఘట్టాలివీ..

రాజకీయంగా ‘కారు’ పార్టీకి 2019 అన్ని రకాలుగా కలిసొచ్చింది

కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ పదవి కట్టబెట్టడం.. రాజకీయ వర్గాలకు కేసీఆర్ తన వారసత్వం విషయంలోనూ స్పష్టమైన సంకేతాలు

ఎమ్మెల్యేల విలీనం ద్వారా రాష్ట్రంలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ను కోలుకోని దెబ్బ తీసింది.
పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు జూన్ 21న అధికారికంగా ప్రారంభం

గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేపట్టాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకున్నా ఆగిపోయింది.

మెట్రో రైలు విస్తరణ తదితర అంశాలు

హుజుర్ ఎన్నికల్లో ఘోరంగా కాంగ్రెస్ ఓటమిపాలవ్వడం.. కంచుకోటను ‘కారు’ బద్ధలుకొట్టింది
ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా సీఎం కేసీఆర్‌కు బూస్ట్ ఇచ్చినట్లయ్యింది.! కొన్నేళ్లుగా నెలకొన్న సమస్యలకు పరిష్కారం.. ఇచ్చిపుచ్చుకోవడంలో మంచి స్నేహం.

మంత్రి వర్గ విస్తరణ:

తొలిసారి రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు చోటు దక్కింది.. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మంత్రులు అయ్యారు

ఇదివరకు కేబినెట్‌లో పనిచేసిన మంత్రుల్లో కొందరికి చోటు.. మరికొందరికి ఉద్వాసన.. ఊహించని శాఖలు కేటాయింపు

బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం

టీఆర్ఎస్‌కు ఊహించని షాక్:

పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఊహించని షాక్.. నిజామాబాద్ నుంచి పోటీచేసిన కేసీఆర్ కుమార్తె.. ఘోరంగా ఓటమిపాలవ్వడం

ఎవరూ ఊహించని రీతిలో నిజామాబాద్‌లో కాషాయ జెండా రెపరెపలాడటం గులాబీ బాస్‌కు షాకింగే!

నిజంగా ఇలా జరుగుతుందని అధికార పార్టీ ఊహించలేదు.. ఆ దెబ్బ నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్న ‘కారు’

వివాదాలు..

తెలంగాణను కుదిపేసిన ఇంటర్ బోర్డు ఫలితాలు.. ధర్నాలు, నిరసనలు.. తీవ్ర విమర్శలు

వెటర్నరీ డాక్టర్ దిశ ఘటనతో యావత్ ప్రపంచ వ్యాప్తంగా కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు.. ఆ తర్వాత ప్రశంసలు

దిశ హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌తో కేసీఆర్, పోలీసు శాఖను ప్రపంచం మెచ్చుకుంది

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కొత్తసర్సాలో అటవీశాఖ అధికారిణిపై దాడి ఘటన సంచలనం రేపింది.

యాదగిరి గుట్ట ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రాన్ని, కారు బొమ్మను చెక్కడం.. వివాదాస్పదం కావడంతో సీఎం ఆదేశాలతో వాటిని తొలగించడం.

కాంగ్రెస్‌కు కలిసిరాని 2019:

ముందస్తు ఎన్నికలు కాంగ్రెస్‌కు కలిసిరాలేదు

ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం

హుజుర్ ఎన్నికల్లో ఘోరంగా కాంగ్రెస్ ఓడిపోవడం.. దీంతో ఉత్తమ్‌ పీసీసీ పదవికి చిక్కులు!

ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి ఓ ఎమ్మెల్సీ సీటు.. 3 లోక్‌సభ స్థానాల్లో విజయం మినహా ఈ ఏడాది అన్నీ ఒడుదొడుకులే.

ఇక పార్టీ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి, మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ కన్నుమూత పార్టీ శ్రేణుల్లో విషాదం నింపింది.

కమలం వికసించింది!

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి నాలుగు స్థానాల్లో విజయం

కేసీఆర్ కుమార్తె కవితను ఘోరంగా ఓడించి అక్కడ కాషాయ జెండా పాతడం

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బండి సంజయ్.. పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం

సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి.. ఏకంగా కేంద్రంలో హోం శాఖ సహాయ మంత్రి పదవిని దక్కించుకోవడం

నిజంగా ఈ ఘటనలు కమలదళంలో కొత్త జోష్‌ను నింపాయి.

టీఆర్‌ఎస్‌కు సరైన ప్రత్యామ్నాయం తామేనంటూ ఆ పార్టీ నేతలు దూకుడు పెంచారు.

ఆర్టీసీ సమ్మె.. కేసీఆర్ సక్సెస్..

ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్స్ నెరవేర్చాలని సమ్మె

52 రోజుల సుదీర్ఘ సమ్మె చివరికి ఊహించని మలుపు

ఈ అంశాన్ని కాంగ్రెస్, ఇటు బీజేపీలతో పాటు లెఫ్ట్ పార్టీలు సువర్ణావకాశంగా మలుచుకోవాలని చూడటం.. తీరా చూస్తే కేసీఆర్ షాకింగ్ నిర్ణయం

ఆర్టీసీ ఉద్యోగులు బేషరతుగా సమ్మె విరమించి విధుల్లో చేర్చుకోవడమే కాదు.. వారిపై వరాల జల్లు

అదే ఊపులో తనదైన చాణక్య నీతిని ప్రదర్శిస్తూ.. ఆర్టీసీ ఛార్జీలు పెంచడం కొసమెరుపు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ప్రధాన ఘట్టాలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో ఘోరాతి ఘోర రోడ్డు ప్రమాదాలు, అత్యాచార ఘటనలు చోటుచేసుకున్నాయి. మొత్తమ్మీద కవిత ఓటమితో షాకవ్వగా.. హుజుర్ నగర్‌లో గెలుపుతో కారు జోరు పెరిగింది. అయితే దిశ ఘటనతోనే కాస్త కేసీఆర్‌కు కలిసిరాలేదు.. మిగిలినవన్నీ సూపర్బ్ గులాబీ బాస్!.