ఆదిత్య మ్యూజిక్ సంస్థకు మధురానుభూతిని మిగిల్చిన ఏడాదిగా 2017
Send us your feedback to audioarticles@vaarta.com
రెండు దశాబ్దాలుగా మ్యూజిక్ రంగంలో నెంబర్ వన్గా రాణిస్తున్న సంస్థ ఆదిత్య మ్యూజిక్ సంస్థకు 2017 మధురానుభూతిని మిగిల్చింది. ఈ సందర్భంగా మ్యూజికల్గా సెన్నేషనల్ హిట్ మూవీస్ను అందించిన తెలుగు మ్యూజిక్ లవర్స్కు కృతజ్ఞతలు తెలియజేస్తుంది.
టాలీవుడ్లో..ఆదిత్య మ్యూజిక్ ప్రయాణంలో ఇదొక గొప్ప సంవత్సరంగా నిలిచిపోయింది. 2017లో విడుదలైన అన్నీ బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఆదిత్య మ్యూజిక్ అనుబంధం కొనసాగుతుంది. మ్యూజిక్ పరంగానే కాకుండా 'ఖాకి' సినిమా ద్వారా నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టింది ఆదిత్య మ్యూజిక్.
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సంచలనాలకు తెర తీసిన శతమానం భవతి, నేనున లోకల్, విన్నర్, కాటమరాయుడు, డీజే దువ్వాడ జగన్నాథమ్, అర్జున్రెడ్డి, రారండోయ్ వేడుక చూద్దాం, లై, ఫిదా, ఉన్నది ఒకటే జిందగీ, పైసా వసూల్, రాజా ది గ్రేట్, ఖాకి, అజ్ఞాతవాసి, ఎంసీఏ, హలో, జై సింహా, ఛలో, మనసుకి నచ్చింది తదితర చిత్రాలకు ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. అన్నీ మ్యూజిక్ ఫ్లాట్ ఫామ్స్లో ఈ సినిమా పాటలు ట్రెండింగ్ అయ్యాయి.
వచ్చే ఏడాది తెలుగులో విడుదల కానున్న భారీ చిత్రాలు అజ్ఞాతవాసి, జై సింహా సినిమాలతో కూడా ఆదిత్య మ్యూజిక్ అసోసియేట్ అయ్యింది. మరిన్ని సూపర్డూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ను 2018లో తెలుగు ప్రేక్షకులకు అందించడానికి రెడీ అవుతోంది ఆదిత్య మ్యూజిక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com