2016 నాకు బాగా క‌లిసి వ‌చ్చింది - నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌

  • IndiaGlitz, [Monday,July 18 2016]

బాల‌కృష్ణ, మోహిని జంట‌గా సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై రూపొందిన చిత్రం 'ఆదిత్య 369'. ఈ సినిమా 1991జూలై 18న విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా టైమ్ మిష‌న్‌పై వ‌చ్చిన సినిమాగా అప్ప‌ట్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత చిత్ర నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ మీడియాతో త‌న సినిమా సంగ‌తుల‌ను తెలియ‌జేశారు. బాల‌సుబ్ర‌మ‌ణ్యంగారు సింగీతం శ్రీనివాస రావు ద‌గ్గ‌ర మంచి క‌థ వుందన్నారు. ఆయ‌న మాట‌పై నేను సింగీతం గారిని క‌లిశాను. ఆయ‌న బ్యాక్ టు ఫ్యూచ‌ర్ స‌హా కొన్ని ఇంగ్లీషు సినిమాల ప్రేర‌ణ‌తో వాటికేం సంబంధం లేకుండా మ‌న నెటివిటీతో టైంమిష‌న్‌పై రాసుకున్న క‌థ అని 45 నిమిషాల పాటు నెరేట్ చేశారు. క‌థ న‌చ్చింది. ముఖ్యంగా శ్రీకృష్ణ‌దేవ‌రాయులు గురించి చెప్పేట‌ప్పుడు ఈ క‌థ‌ను బాల‌కృష్ణ‌గారైతేనే న్యాయం చేస్తార‌ని అన్నారు. దేవిఫిలింస్ దేవీ వ‌ర ప్ర‌సాద్‌గారి స‌హాయంతో బాల‌కృష్ణ‌గారిని క‌లిసి క‌థ చెప్పాం. బాల‌కృష్ణ‌గారు క‌థ న‌చ్చ‌డంతో కొత్త నిర్మాత‌నైనా ఏ మాత్రం ఆలోచించ‌కుండా సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నారు.

ఈ సినిమాకు ముందు యుగ‌పురుషుడు అనే టైటిల్ అనుకున్న‌ప్ప‌టికీ నాన్న‌గారు టైటిల్ వద్దులేండి అని బాల‌కృష్ణ‌గారు చెప్ప‌డంతో ఏ టైటిల్ పెట్టాలా అని తెగ ఆలోచించాం. కాలంతో పాటు ట్రావెల్ అయ్యే వ్య‌క్తి సూర్యుడు. ఆయ‌న‌కు ఆదిత్య అనే పేరుంది క‌దా, ఇక మిష‌న్‌పై జ‌రిగే క‌థ కావ‌డంతో ఓ సీక్వెన్స్ కోస‌మ‌ని 369 అనుకుని ఆదిత్య 369 అనే టైటిల్ పెట్టాం. అన్న‌పూర్ణ స్టూడియోలో నాలుగు ఫోర్స్‌లో సెట్ వేసి సినిమా షూటింగ్ చేశాం. 110 రోజుల పాటు షూటింగ్ జ‌రిగింది. కోటిన్న‌ర రూపాయ‌ల బ‌డ్జెట్‌తో సినిమాను గ్రాండ్‌గా నిర్మించాను. అదే ఇప్ప‌ట్లో అయితే మినిమ‌మ్ 60 కోట్ల రూపాయ‌లు అవుతుంది.

సినిమాను చూసిన అంద‌రూ చాలా బావుంద‌ని అన్నారు. కొంత మంది మాత్రం ఇది అడ్వాన్స్‌డ్ మూవీ అని 20 ఏళ్ళ త‌ర్వాత రావాల్సిన చిత్ర‌మ‌ని కూడా అన్నారు. అయితే స్వీర్గీయ ఎన్టీఆర్ సినిమా చూసి చాలా బావుంద‌ని, శ్రీ కృష్ణ‌దేవ‌రాయ‌లుగా బాల‌య్య బాగా చేశార‌ని అప్రిసియేట్ చేశారు. త‌మిళంలో అపూర్వ‌శ‌క్తి 369, హిందీలో 369 పేరుతో డ‌బ్ చేసి విడుద‌ల చేశారు. అక్క‌డ కూడా సినిమా స‌క్సెస్ సాధించింది.

2016 నిర్మాత‌గా నాకు బాగా క‌లిసి వ‌చ్చింది. ఎందుకంటే ఈ ఏడాది నేను నిర్మించిన జెంటిల్‌మన్ పెద్ద స‌క్సెస్ కాగా, ఆదిత్య 369 సినిమా పాతిక వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంది కూడా ఈ ఏడాదే కావ‌డం విశేషం.

More News

లోగో విడుద‌ల చేసిన ద‌ర్శ‌కేంద్రుడు

`సోగ్గాడే చిన్ని నాయనా`, `ఊపిరి` చిత్రాలు త‌ర్వాత నాగార్జున మ‌రోసారి డిఫ‌రెంట్‌గా భ‌క్తిర‌స‌న ప్ర‌ధాన చిత్రం `ఓం న‌మో వెంక‌టేశాయ` చిత్రంలో న‌టిస్తున్నాడు.

కబాలి ఈజ్ బ్యాక్...ఇవిగో ఫోటోస్

సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ క‌బాలి సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి కాగానే ఆనారోగ్యానికి గురైయ్యారు. ఆయ‌న ఆరోగ్యం క్రిటికల్‌గా ఉందంటూ కూడా వార్త‌లు వినిపించాయి.

జూలై 29న విడుదలవుతున్న 'పెళ్లి చూపులు'

ధర్మపథ క్రియెషన్స్ మరియు బిగ్ బెన్ సినిమాస్ పై రాజ్ కందుకూరి మరియు యష్ రంగినెని సమ్యుక్తంగా, నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వం లొ విజయ్ దెవరకొండ, రీతు వర్మ, నందు ప్రధాన పాత్ర ల్లొ నిర్మించిన చిత్రం పెళ్లిచూపులు.

జులై 29 న రిలయన్స్ మరియు డిస్నీ వారి 'ది బి ఎఫ్ జి' చిత్రం విడుదల

జురాసిక్ పార్క్ ,జాస్,ఇండియానా జోన్స్ వంటి అద్భుతమైన చిత్రాల రూపకర్త స్టీవెన్ స్పిఎల్బర్గ్ దర్శకత్వం లో వస్తోన్న అద్భుతమైన ఫాంటసి చిత్రం ,' ది బి ఎఫ్ జి(ది బిగ్ ఫ్రెండ్లీ జయంట్)'.

'త్రయం' టీజర్ విడుదల

విష్ణురెడ్డి,అభిరాం,సంజన హీరో హీరోయిన్లుగా పంచాక్షరి పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'త్రయం'. డా.గౌతమ్ నాయుడు దర్శకత్వంలో పద్మజానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు.