2016 నాకు బాగా కలిసి వచ్చింది - నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలకృష్ణ, మోహిని జంటగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం `ఆదిత్య 369`. ఈ సినిమా 1991జూలై 18న విడుదలై ఘన విజయం సాధించడమే కాకుండా టైమ్ మిషన్‌పై వచ్చిన సినిమాగా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఈ సందర్భంగా నిర్మాత చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మీడియాతో తన సినిమా సంగతులను తెలియజేశారు. బాలసుబ్రమణ్యంగారు సింగీతం శ్రీనివాస రావు దగ్గర మంచి కథ వుందన్నారు. ఆయన మాటపై నేను సింగీతం గారిని కలిశాను. ఆయన బ్యాక్ టు ఫ్యూచర్ సహా కొన్ని ఇంగ్లీషు సినిమాల ప్రేరణతో వాటికేం సంబంధం లేకుండా మన నెటివిటీతో టైంమిషన్పై రాసుకున్న కథ అని 45 నిమిషాల పాటు నెరేట్ చేశారు. కథ నచ్చింది. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయులు గురించి చెప్పేటప్పుడు ఈ కథను బాలకృష్ణగారైతేనే న్యాయం చేస్తారని అన్నారు. దేవిఫిలింస్ దేవీ వర ప్రసాద్‌గారి సహాయంతో బాలకృష్ణగారిని కలిసి కథ చెప్పాం. బాలకృష్ణగారు కథ నచ్చడంతో కొత్త నిర్మాతనైనా ఏ మాత్రం ఆలోచించకుండా సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.
ఈ సినిమాకు ముందు యుగపురుషుడు అనే టైటిల్ అనుకున్నప్పటికీ నాన్నగారు టైటిల్ వద్దులేండి అని బాలకృష్ణగారు చెప్పడంతో ఏ టైటిల్ పెట్టాలా అని తెగ ఆలోచించాం. కాలంతో పాటు ట్రావెల్ అయ్యే వ్యక్తి సూర్యుడు. ఆయనకు ఆదిత్య అనే పేరుంది కదా, ఇక మిషన్‌పై జరిగే కథ కావడంతో ఓ సీక్వెన్స్ కోసమని 369 అనుకుని ఆదిత్య 369 అనే టైటిల్ పెట్టాం. అన్నపూర్ణ స్టూడియోలో నాలుగు ఫోర్స్‌లో సెట్ వేసి సినిమా షూటింగ్ చేశాం. 110 రోజుల పాటు షూటింగ్ జరిగింది. కోటిన్నర రూపాయల బడ్జెట్‌తో సినిమాను గ్రాండ్‌గా నిర్మించాను. అదే ఇప్పట్లో అయితే మినిమమ్ 60 కోట్ల రూపాయలు అవుతుంది.
సినిమాను చూసిన అందరూ చాలా బావుందని అన్నారు. కొంత మంది మాత్రం ఇది అడ్వాన్స్డ్ మూవీ అని 20 ఏళ్ళ తర్వాత రావాల్సిన చిత్రమని కూడా అన్నారు. అయితే స్వీర్గీయ ఎన్టీఆర్ సినిమా చూసి చాలా బావుందని, శ్రీ కృష్ణదేవరాయలుగా బాలయ్య బాగా చేశారని అప్రిసియేట్ చేశారు. తమిళంలో అపూర్వశక్తి 369, హిందీలో 369 పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. అక్కడ కూడా సినిమా సక్సెస్ సాధించింది.
2016 నిర్మాతగా నాకు బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే ఈ ఏడాది నేను నిర్మించిన జెంటిల్మన్ పెద్ద సక్సెస్ కాగా, ఆదిత్య 369 సినిమా పాతిక వసంతాలను పూర్తి చేసుకుంది కూడా ఈ ఏడాదే కావడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com